స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1034 లో.....రాజు తనకి చెప్పకుండా పెళ్లి చేసుకొని గొప్పింటికి అల్లుడు అయ్యాడని లక్కీ కుళ్ళుకుంటాడు.
ఒరేయ్ నువ్వేం టెన్షన్ పడకు.. నేను ముందు వెళ్ళాను.. తర్వాత నిన్ను ఈ ఇంట్లో అడుగుపెట్టేలా చేస్తాను.. అప్పుడు నువ్వు ఐశ్వర్యకి దగ్గర కావచ్చని రాజు అనగానే ముందు ఆ పని మీద ఉండురా బాబు అని లక్కీ అంటాడు.
అయితే నేను రిచ్ గా షాపింగ్ చేస్తానని లక్కీ వెళ్ళిపోతాడు.ఆ ఇంట్లోకి అద్దె మొగుడుగా వెళ్ళానని తెలిస్తే ఏమైపోతాడోనని రాజు అనుకుంటాడు. రాజుకి డాక్టర్ ఫోన్ చేసి బిల్ కట్టమని అడుగుతాడు. వారం రోజులు టైమ్ ఇవ్వండి అని రాజు చెప్తాడు. ఆ తర్వాత అపర్ణ కోపంగా రేఖ దగ్గరికి వస్తుంది.
ఈ నెల ఎంప్లాయిస్ కి జీతాలు ఎందుకు ఇవ్వలేదని కోప్పడుతుంది. ఇన్ని రోజులుగా కంపెనీకి మంచి పేరు ఉంది. దాన్ని నాశనం చేసున్నావని కోప్పడుతుంది. ఒక్క నెల లేటుగా వెళ్తే ఏంటని రేఖ అనగానే ఒక్క నెల జీతాలు అంటే నీకు తమాషాగా ఉంది..
అవి ఒక మధ్యతరగతి వాడికి ఆధారమని అపర్ణ అంటుంది. అయినా ఆ డబ్బు ఏం చేసావని అపర్ణ అడుగుతుంది. మీ మనవరాలు కిడ్నాప్ అయింది కదా అప్పుడు ఇరవై లక్షలు ఇచ్చే కదా తనని తీసుకొని వచ్చానని రేఖ అంటుంది. అయినా నీకు ఆఫీస్ విషయం ఎందుకు ఒక మూలాన కూర్చొని ఉండక అని రేఖ అంటుంది.
ఆ తర్వాత అపర్ణ గదిలోకి వెళ్తుంది. మీ అమ్మ ఉంటే ఇలా కానిచ్చేది కాదు ఆఫీస్ కి వెళ్ళేది అక్కడ అంత చక్కపెట్టేది అని అపర్ణ అంటుంది. అమ్మ అయితే వెళ్ళేది నేను వెళ్ళలేను నానమ్మ అని ఇందు అంటుంది. ఎందుకంటే నిన్ను భయం కమ్మేసింది అని అపర్ణ కోప్పడుతుంది.
ఆ తర్వాత ఇందు ఎన్ని డబ్బులు ఇవ్వాలో రాజు లెక్కలేసుకుంటాడు. ఇందు వచ్చి నీ డబ్బు అని వెయ్యి రూపాయలు ఇస్తుంది. రెండు రోజులకి ఇరవై వేయిలు కదా అని రాజు అంటాడు. నువ్వు నా కండిషన్స్ బ్రేక్ చేసావ్ అందుకే అని బ్రేక్ చేసిన విషయాలు అన్ని చెప్తుంది అన్నీ పొగా నీకు వెయ్యి రూపాయలు వస్తాయని ఇందు చెప్తుంది.
తరువాయి భాగంలో బీరువాలో ఉన్న రాజ్ డ్రెస్ ఇందు తీసి రాజుకి ఇస్తుంది. రాజు ఆ డ్రెస్ వేసుకుంటాడు. ఇద్దరు ఆఫీస్ కి వెళ్ళడానికి పై నుండి వస్తుంటే అందరు చూసి షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

