Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Rashmika mandanna రష్మికకి చేదు అనుభవం అసభ్యకరంగా ప్రవర్తించిన స్టార్ హీరో

Rashmika mandanna రష్మికకి చేదు అనుభవం అసభ్యకరంగా ప్రవర్తించిన స్టార్ హీరో

ష్మిక(rashmika mandanna)మందన్నా అప్ కమింగ్ బాలీవుడ్ మూవీ 'కాక్‌టెయిల్ 2'.. స్టార్ హీరో షాహిద్ కపూర్, కృతి సనన్ తో కలిసి రష్మిక స్క్రీన్ షేర్ చేసుకుంది.

విజయ్ దేవరకొండ తో వివాహం తర్వాత వస్తున్న మూవీ కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ప్రమోషన్స్ భాగంగా రీసెంట్ గా ముంబైలో మ్యూజిక్ లాంచ్ ఈవెంట్‌ జరగగా రష్మిక కూడా హాజరైంది. కానీ ఎవరు ఊహించని విధంగా రష్మిక కి చేదు అనుభవం ఎదురైంది. చిత్ర దర్శకుడు హోమి అదజానియా, నిర్మాత దినేష్ విజన్‌లతో కలిసి రష్మిక మందన్నా ఎంతో ఉత్సాహంగా హాజరైంది.

వేదికపై చిత్ర యూనిట్ అంతా సినిమా విశేషాలను పంచుకుంటూ, మీడియా ప్రతినిధులతో ఎంతో సరదాగా ముచ్చటిస్తున్నారు. పాటల విడుదల అనంతరం ప్రెస్ మీట్ సాగుతున్న తరుణంలో, రష్మిక మందన్నా మైక్ పట్టుకుని మాట్లాడుతోంది. అదే సమయంలో పక్కనే నిల్చున్న షాహిద్ కపూర్ ఒక్కసారిగా రష్మిక భుజంపై చేయి వేశాడు. ఈ అకస్మాత్తు చర్యతో రష్మిక మందన్నా తీవ్రమైన అసౌకర్యానికి ,ఇబ్బందికి గురైంది.

సోషల్ మీడియాలో వైరల్ హోదాలో ఉన్న సదరు వీడియో చూస్తుంటే షాహిద్ కపూర్ ప్రవర్తనకి రష్మిక ఒక్క క్షణం షాక్‌కు గురైనట్లు స్పష్టంగా కనిపించింది. ఆ అసౌకర్యాన్ని ఏమాత్రం దాచుకోలేక, ఆమె వెంటనే సున్నితంగా స్పందిస్తూ అతని చేతి నుంచి తప్పించుకుని కాస్త పక్కకు జరిగి నిలబడింది. వేదికపై లైవ్ కెమెరాల ముందు ఈ ఘటన జరిగినప్పటికీ, రష్మిక తన ప్రొఫెషనలిజాన్ని ప్రదర్శిస్తూ ముఖంపై నవ్వును కోల్పోకుండా పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసింది. కానీ, ఆమె బాడీ లాంగ్వేజ్ మరియు ముఖ కవళికలను గమనిస్తే ఆమె ఎంతగా అన్‌కంఫర్టబుల్‌గా ఫీలయ్యిందో స్పష్టంగా అర్థమవుతోంది.

ఈ క్రమంలోనే ఈవెంట్‌లో కృతి సనన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ఫ్లోలో రష్మిక నోటి వెంట ఒక అపశబ్దం (F-Bomb) కూడా దొర్లింది. తాను ఏం మాట్లాడానో వెంటనే గ్రహించిన రష్మిక, నాలుక కరుచుకుని సైలెంట్‌గా ఉండాలంటూ సైగలు చేయడంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు. Also read: Toxic: టాక్సిక్ ఆలస్యం వెనుక అసలు రహస్యం.. యశ్ సంచలన వ్యాఖ్యలు ఈ ఈవెంట్‌కి సంబంధించిన వీడియోలు మరియు క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ హిట్ మూవీ అర్జున్ రెడ్డిని షాహిద్ కపూర్ కబీర్ సింగ్ గా తెరకెక్కించాడు. షాహిద్, రష్మిక ల ఫస్ట్ కాంబో మాత్రం 'కాక్‌టెయిల్ 2 నే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One