Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రవితేజతో ప్రియాంక అరుళ్ మోహన్?

రవితేజతో ప్రియాంక అరుళ్ మోహన్?

క్రాక్ ఘనవిజయంతో మాస్ మహారాజా రవితేజ మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశారు. ప్రస్తుతం ఖిలాడి చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. ఇందులో రెండు విభిన్న పాత్రల్లో దర్శనమివ్వనున్నారాయన. రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నాయికలుగా నటిస్తున్నారు. వేసవిలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్స్ లో సందడి చేయనుంది.

ఇదిలా ఉంటే.. ఖిలాడి తరువాత నక్కిన త్రినాథరావ్ దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయనున్నారని టాక్. వేసవిలో పట్టాలెక్కే ఈ చిత్రంలో రవితేజకి జోడీగా గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ నటించనుందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశముంది.

కాగా, ప్రస్తుతం ప్రియాంక అరుళ్ మోహన్ చేతిలో శర్వానంద్ శ్రీకారంతో పాటు తమిళ చిత్రం డాక్టర్ (ఇందులో శివకార్తికేయన్ కథానాయకుడు) ఉంది. అలాగే కోలీవుడ్ స్టార్ సూర్యకి జంటగా నటించే అవకాశం కూడా ఈ అమ్మడిని వరించిందని అంటున్నారు. మరి.. సూర్య, రవితేజ చిత్రాలతో ప్రియాంక దశ, దిశ మారుతాయేమో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One