Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రోజా గారు మంచి ఫిలాంత్రఫిస్ట్నెక్స్ట్ టార్గెట్ జాఫర్!

రోజా గారు మంచి ఫిలాంత్రఫిస్ట్నెక్స్ట్ టార్గెట్ జాఫర్!

ఫామిలీ అసెంబ్లీ లేటెస్ట్ ఎపిసోడ్ కి జర్నలిస్ట్ జాఫర్ అతని భార్య వచ్చారు. వీళ్ళతో రోజా ఒక టాస్క్ ఆడించారు. భార్యను ఎత్తుకుంటే పైన వేళ్ళాడే ద్రాక్ష గుత్తును నోటితో అందుకుని తినడం ఐతే.

ఇక ఆమె బాగా ఆడారంటూ రోజా మెచ్చుకుంది. ఇక జాఫర్ రోజా గురించి ఆమె చేసిన పనుల గురించి చెప్పుకొచ్చారు. "రోజా గారి హజ్బెండ్ చాలా మంచి పర్సన్. రోజా గారు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి విభేదించే వాళ్ళు ఉన్నారు కానీ ఆమె భర్తను అందరూ ఇష్టపడతారు.

ఆమెను ఇంటర్వ్యూ చేస్తే కాంట్రోవర్సి అవుతుందని అంటారు కానీ ఆమె ఎంత మంచి ఫిలాంత్రఫిస్ట్ అనే విషయం ఎవరికీ తెలీదు. ఒకసారి నేను మా అమ్మాయి రోజా గారికి బుర్కా వేసి ఒక నియోజకవర్గానికి తీసుకెళ్లాం. అది లైవ్ రికార్డింగ్ అంతా. ఒక సమస్యను పరిష్కరించి చాలా గొప్ప పని చేశారు.

ఆ వీడియో కూడా ఉంది. ఆ తర్వాత ఆమె తన పర్సులో ఉన్న డబ్బులు అది 25 వేలో 50 వేలో తెలీదు. తీసి కామ్ గా ఇచ్చేస్తా ఉన్నారు. అది కెమెరాలో రికార్డు కాలేదు.

మేడం అది రికార్డు కాలేదు అని నేను చెప్తే వొద్దొద్దు జాఫర్ గారి అది జనాల కోసం కాదు అన్నారు. ఇలాంటివి ఆవిడ చాలా చేస్తూ ఉంటారు. పొలిటికల్ గా జనాలకు ఒక పర్సవం మాత్రమే తెలుస్తుంది. ఇంకో పార్శ్వము అనేది ఎక్స్పోజ్ కాదు.

ఎందుకు ఎక్స్పోజ్ కాదు అంటే ఇంకొకళ్ళు చేస్తే వాళ్ళు టార్గెట్ అవుతారు కాబట్టి" అని జాఫర్ చెప్పారు. "నెక్స్ట్ నువ్వే టార్గెట్ " అంటూ నవ్వుతూ చెప్పారు రోజా. "పర్వాలేదు. మంచి , చెడు రెండు విషయాలు చెప్పాలి జర్నలిస్ట్ అంటే " అన్నారు జాఫర్. "థాంక్యూ జాఫర్" అన్నారు రోజా.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One