Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రోజా నోటా చిరు డైలాగ్త్వరలో అత్త కాబోతున్న రోజా

రోజా నోటా చిరు డైలాగ్త్వరలో అత్త కాబోతున్న రోజా

ఫామిలీ అసెంబ్లీ లేటెస్ట్ ఎపిసోడ్ లో అత్తాకోడళ్లు కాన్సెప్ట్ తో వచ్చి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. ఈ షోలోకి సీనియర్ నటిగా ఎన్నో మూవీస్ లో నటించిన జయలలిత కూడా వచ్చారు.

"ఎప్పుడూ 1991 లో ఆమెతో కలిసి నేను యాక్ట్ చేసాను. నన్ను చాలా చిన్న అమ్మాయిగా చూసారు. పెళ్ళై పిల్లలు పుట్టారు. నేను కూడా అత్త కాబోతున్నాను.

ఇంకా అవ్వలేదు అవ్వబోతున్న. ఈ జర్నీలో మీ అందం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. మీలాంటి సీనియర్స్ మా షోకి వస్తే అలా ఊరికే పంపించము.. ఈ సన్మానం చేసే ముందు చిరంజీవి మూవీలో ఒక డైలాగ్ చెపుదామనుకున్న...ఈ సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడి ఇక్కడ ఈ ఫామిలీ అసెంబ్లీలో మా జయలలితది " అని డైలాగ్ చెప్పారు రోజా.

"సినిమాల్లో ఎన్నో క్యారెక్టర్స్ చేశారు. కొన్ని నవ్వించేవి, కొన్ని కవ్వించేవి, కొన్ని ఏడిపించేవి చేశారు. అలాంటి మీకు సన్మానం చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మరి దీని మీ ఫీలింగ్ ఏంటి" అని రోజా అడిగారు.

"నేను అసలు ఊహించలేదు. నన్ను ఈ షోకి అడిగినప్పుడు కొంచెం సందేహించాను. కొన్ని అనివార్య కారణాల వలన రావాలా వద్దా అని ఆలోచించాను. కానీ ఒకవేళ ఈ షోకి రాకుండా ఉంటే నా జీవితంలో ఒక మంచి సుదినాన్ని మిస్ అయ్యేదాన్ని. ఇక్కడ ఉన్న అందరి గురించి ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది. గాడ్ బ్లేస్ యు ఆల్ లవ్ యు ఆల్" అని చెప్పారు జయలలిత.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One