Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రోజూ ఉదయాన్నే ఈ చిన్న పని చేస్తే చర్మం మెరిసిపోతుంది-

రోజూ ఉదయాన్నే ఈ చిన్న పని చేస్తే చర్మం మెరిసిపోతుంది-

నేటి రోజుల్లో ప్రతి ఒక్కరూ అందమైన, ప్రకాశవంతమైన చర్మం కోసం రకరకాల కెమికల్ కాస్మోటిక్ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. అయితే ఇటువంటి రసాయనాలు తాత్కాలిక మెరుపును ఇచ్చినప్పటికీ, కాలక్రమేణా చర్మానికి తీవ్ర హాని కలిగిస్తాయి.

సహజమైన పద్ధతిలో, ఎలాంటి ఖర్చు లేకుంటే చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా మార్చుకోవడం చాలా సులభం. దానికి చేయాల్సిందల్లా రోజూ ఉదయం నిద్రలేవగానే ఒక చిన్న అలవాటును చేసుకోవడమే. అదే ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటిని తాగడం. ఉదయాన్నే గోరు వెచ్చని నీరు తాగడం అనే చిన్న అలవాటు చర్మాన్ని లోపలి నుండి ఎలా ప్రకాశవంతంగా మారుస్తుందో, దానికి గల కారణాలు , దీనివల్ల కలిగే ప్రయోజనాలను వివరంగా తెలుసుకుంటే..

శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది.. మనం రాత్రి నిద్రపోతున్న సమయంలో మన శరీరం అంతర్గత శుభ్రపరిచే ప్రక్రియను చేపడుతుంది. ఉదయాన్నే నిద్రలేవగానే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగడం వల్ల పేగుల్లో , శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి అవ్వడం వల్ల చర్మంపై దద్దుర్లు, మొటిమలు తగ్గడమే కాకుండా సహజమైన మెరుపు వస్తుంది.

చర్మానికి అవసరమైన తేమను అందిస్తుంది.. రాత్రంతా నీరు తాగకపోవడం వల్ల ఉదయానికి శరీరం స్వల్పంగా డీహైడ్రేట్ కు గురవుతుంది. ఉదయాన్నే నీరు తాగడం ద్వారా శరీర కణాలు, చర్మ కణాలు తిరిగి తేమను పొందుతాయి. ఇది చర్మం పొడిబారకుండా చూస్తుంది.

సరిపడా తేమ ఉన్న చర్మం ఎల్లప్పుడూ తాజాదనంతో , కాంతివంతంగా కనిపిస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.. గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరంలో రక్తప్రసరణ వేగవంతమవుతుంది. రక్తప్రసరణ సరిగ్గా ఉన్నప్పుడు చర్మ కణాలకు అవసరమైన ఆక్సిజన్, పోషకాలు సమృద్ధిగా అందుతాయి.

దీనివల్ల ముఖంపై సహజమైన ఎరుపుదనం, కాంతి కనిపిస్తాయి. నిస్తేజంగా ఉన్న చర్మానికి ఇది తక్షణ జీవాన్ని ఇస్తుంది. అకాల వృద్ధాప్య ఛాయలను అడ్డుకుంటుంది.. శరీరంలో విష పదార్థాలు ఎక్కువగా ఉంటే చర్మం త్వరగా ముడతలు పడటం, కాంతి కోల్పోవడం జరుగుతుంది.

ఉదయాన్నే నీరు తాగడం వల్ల శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తొలగిపోయి చర్మం సాగే గుణాన్ని కాపాడుకుంటుంది. ఇది ముఖంపై ముడతలు, గీతలు రాకుండా నిరోధించి చర్మాన్ని ఎల్లప్పుడూ యవ్వనంగా ఉంచుతుంది. ఈ అలవాటును మరింత ప్రభావవంతంగా ఎలా మార్చుకోవాలి? సాదా గోరువెచ్చని నీరు తాగడం మంచిదే అయినా, చర్మ తత్వానికి తగినట్లుగా నీటిలో కొన్ని సహజమైన పదార్థాలను కలిపి తాగడం వల్ల మరిన్ని అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.

నిమ్మరసం మరియు తేనె.. గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయ రసం, ఒక చెంచా సహజమైన తేనె కలిపి తాగడం వల్ల శరీరానికి విటమిన్ సి అందుతుంది. విటమిన్ సి చర్మంలో కొల్లాజెన్ ఉత్పాదనను పెంచి, చర్మాన్ని దృఢంగా , ప్రకాశవంతంగా మారుస్తుంది. జీలకర్ర లేదా వాము నీరు..

రాత్రివేళ ఒక గ్లాసు నీటిలో కొద్దిగా జీలకర్ర నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని మరిగించి గోరువెచ్చగా తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. జీర్ణక్రియ సరిగ్గా ఉంటే ముఖంపై మొటిమలు రావు. ఉదయం నీరు తాగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఉదయాన్నే నిద్రలేవగానే బ్రష్ చేయకముందే నీరు తాగడం వల్ల నోట్లోని లాలాజలం కడుపులోకి వెళ్లి జీర్ణక్రియను మరింత వేగవంతం చేస్తుంది.

నీటిని ఒకేసారి వేగంగా తాగకుండా, నిలబడి కాకుండా ప్రశాంతంగా కూర్చుని మెల్లమెల్లగా గుటకలు వేస్తూ తాగాలి. అతిగా వేడిగా ఉన్న నీటిని తాగకూడదు, కేవలం గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి. బాహ్య సౌందర్యం కంటే అంతర్గత ఆరోగ్యమే చర్మ సౌందర్యానికి అసలైన మూలం. ఎలాంటి రసాయనాలు, క్రీములు వాడాల్సిన అవసరం లేకుండా రోజూ ఉదయాన్నే పరగడుపున నీరు తాగే ఈ చిన్న అలవాటును క్రమం తప్పకుండా కొన్ని వారాల పాటు పాటిస్తే చర్మంలో వచ్చే అద్భుతమైన మార్పును గమనించవచ్చు. *రూపశ్రీ.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One