Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సహ ట్రైలర్ రివ్యూ గుండెను పిండేసే ప్రేమకథ ఒక్క తప్పు జీవితాన్ని మార్చేసింది!

సహ ట్రైలర్ రివ్యూ గుండెను పిండేసే ప్రేమకథ ఒక్క తప్పు జీవితాన్ని మార్చేసింది!

నూతన నటీనటులతో, మనసుకు హత్తుకునే భావోద్వేగాలతో తెరకెక్కిన చిత్రం 'సహ - లైఫ్ ఆఫ్ సంజు'. సుమైరా స్టూడియోస్ బ్యానర్ పై తేజేశ్వర్ వేల్పుచర్ల నిర్మాణంలో, నిశాంత్ దోటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శివ కుమార్ కాసారం, శ్వేతా లక్ష్మణ్, వ్రజన పాండ్య ప్రధాన పాత్రలు పోషించారు.

తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ, సోషల్ మీడియాలో మంచి ఆదరణ సొంతం చేసుకుంటోంది. ట్రైలర్ ప్రారంభంలోనే సంజు, సహస్రల మధ్య ఉండే నిష్కల్మషమైన ప్రేమ, తుంటరి పనులు ప్రేక్షకులలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. "సహ నీతో కొంచెం మాట్లాడాలి" అంటూ డైరెక్ట్ గా ముద్దు పెట్టేయడం లాంటి సన్నివేశాలతో.. కాలేజీ రోజుల నాటి మధురమైన జ్ఞాపకాలు, ఒకరిపై ఒకరికి ఉన్న అమితమైన అనురాగంతో ఆహ్లాదకరంగా సాగిపోతుంది.

అయితే ఈ సంతోషకరమైన ప్రయాణం ఎక్కువ కాలం నిలవదు. విధి ఆడే విచిత్రమైన ఆటలో వీరి జీవితంలోకి అనూహ్యమైన మలుపులు చోటుచేసుకుంటాయి. కథ ముందుకు సాగుతున్న కొద్దీ ప్రేమతో పాటు తీవ్రమైన మానసిక సంఘర్షణ, గతం తాలూకు వేదన మొదలవుతాయి. తను చేసిన ఒక పొరపాటు వల్ల సంజు ఎలాంటి పశ్చాత్తాపానికి గురయ్యాడు, "నేను ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది కదరా" అంటూ తల్లడిల్లే సన్నివేశాలు ప్రతి ఒక్కరి హృదయాన్ని ద్రవింపజేస్తాయి.

గతాన్ని మళ్ళీ మళ్ళీ తవ్వుకుంటూ సంజు అనుభవించే వేదన, అతని జీవితంలోకి వచ్చే సవాళ్లు ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలవనున్నాయి. ఒక సాధారణ వ్యక్తి జీవిత ప్రయాణం నేపథ్యంలో.. బాల్యం నుండి నడివయసు వరకు సాగే భావోద్వేగాలను దర్శకుడు నిశాంత్ దోటి ప్రతిభావంతంగా ఆవిష్కరించారు. ఈ ట్రైలర్ కు శేఖర్ చంద్ర అందించిన నేపథ్య సంగీతం ఒక ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ప్రతి భావోద్వేగ సన్నివేశంలోనూ ఆయన ఇచ్చిన ఆర్ఆర్ సీన్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ నిర్మాతలుగా పేరుగాంచిన బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని సంయుక్తంగా విడుదల చేస్తుండటంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబరు 4న థియేటర్లలో విడుదల కానున్న ఈ 'సహ' సినిమా, బిగ్ స్క్రీన్ పై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. [Sahaa Life of Sanju, Sahaa Trailer, Shiva Kumar Kasaram, Swetha Lakshman]

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One