సర్కార్ సీజన్ 6 ఆడియన్స్ కి ఎంటర్టైన్ చేయడంతో పాటు ఎడ్యుకేట్ చేస్తూ వస్తోంది. ఇక రీసెంట్ ఎపిసోడ్ కి ఇన్ఫ్లూఎన్సర్లు వచ్చారు. అందులో సోషల్ మీడియాలో ఒక పేరు సంపాదించుకున్న స్రవంతి పెప్పకాయల వచ్చింది.
అలాగే అనన్య శర్మ, క్రిస్టీన్, టిక్ టాక్ భాను కూడా వచ్చారు. ఇక ఈ షోలో సుధీర్ ఎన్నో టాస్కులు ఇచ్చి ఆడించాడు. ఇక లాస్ట్ కి వచ్చేసరికి మిగతా ముగ్గురు కూడా ఇచ్చిన క్వశ్చన్స్ కి ఆన్సర్ లు చెప్పడంలో ఓడిపోయారు. ఫైనల్ గా మిగిలింది స్రవంతి మాత్రమే.
ఇక ఫైనల్ గా కోటి రూపాయల ప్రశ్న అడిగాడు సుధీర్. "టాలీవుడ్ లో రీసెంట్ గా జరిగిన గద్దర్ అవార్డ్స్ లోని గద్దర్ గారి అసలు పేరు ఏమిటి" అంటూ అడిగాడు. వెంటనే స్రవంతి "గుమ్మడి విట్టల్ రావు" అని ఆన్సర్ చేసింది. ఎలా తెలుసు మీకు అని సుధీర్ అడిగేసరికి "నేను అది చూసానండి.
నేను కూడా తర్వాత తీసుకుంటాను కదా అందుకే ముందే చూసి ప్రిపేర్ అవుదాం" అని కౌంటర్ వేసేసరికి పక్కనే ఉన్న టిక్ టాక్ భాను పడీపడీ నవ్వేసింది. అలా ఫైనల్ ఆన్సర్ చెప్పి కోటి రూపాయలు సొంతం చేసుకుంది ఈ అమ్మడు. గోదారి యాసలో ఈమె మాట్లాడే మాటలు చేసే రీల్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ ఉంటాయి. ఈమె చాయ్ బిస్కెట్ , గర్ల్ ఫార్ములా అనే యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా బాగా ఫేమస్ అయ్యింది.

