Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీ డ్రగ్స్ పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీ డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా డ్రగ్స్ విక్రయిస్తు న్నట్లుగా విశ్వసనీయమైన సమాచారం రావడంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్మగ్లర్ల పై ప్రత్యేక నిఘా పెట్టారు.

బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇద్దరు భారతీయ ప్రయాణికుల కదలికలపై అనుమానం రావడంతో డీఆర్ఐ అధికారులు వారిని అడ్డుకున్నారు. అనంతరం అధికారులు వారి చెక్-ఇన్ లగేజీని క్రమపద్ధతిలో తనిఖీ చేయగా... బ్యాగులను తెరిచి చూడగా... ఘాటైన వాసనతో కూడిన ఆకుపచ్చ రంగులో గడ్డలుగా ఉన్న అనుమానాస్పద పదార్థం గల 24 నల్లటి ప్యాకెట్లు కనిపించడంతో అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

ఈ ప్యాకెట్లను ఇన్సులేటెడ్ వాటర్ బాటిళ్లు, ఒక పొటాటో స్నాక్ టిన్, అలాగే పలు ఫుడ్ టిన్ బాక్సులు, ప్లాస్టిక్ మరియు కార్డ్‌బోర్డ్ బాక్సు ఇలా రకరకాల వాటిలో ప్యాకెట్లను దాచిపెట్టి ఎయిర్ పోర్ట్ లో ఉన్న అధికారులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు.. కానీ పాపం చివరకు అధికారుల చేతికి చిక్కారు.. అధికారులు వెంటనే ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 3.05 కోట్ల విలువ చేసే 8.705 కిలోల హైడ్రోపోనిక్ గాంజాను స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసులో ఇద్దరు ప్రయాణికులను ఎన్డీపీఎస్ చట్టం, 1985 నిబంధనల ప్రకారం అరెస్టు చేశారు. డ్రగ్స్ మూలం ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరెవరికి సరఫరా చేయాల్సి ఉందో తెలుసుకునేందుకు అధికారులు లోతైన దర్యాప్తు కొనసాగి స్తున్నారు.

ఇలాంటి విదేశీ మాదక ద్రవ్యాల రవాణా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వెలుగుచూడటం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఖతార్, బ్యాంకాక్ వంటి దేశాల నుండి ఇలాగే కిలోల కొద్దీ డ్రగ్స్‌ను తరలిస్తూ పలువురు పట్టుబడ్డారు. కొద్ది రోజుల క్రితం 27.15 కిలోల బరువు కలిగిన రూ. 9.5 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయిని రవాణా చేస్తున్న ఏడుగురు నిందితుల ముఠాను అధికారులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. అలాగే అంతకుముందు విమాన ప్రయాణికుల సీట్ల కింద ఒక కిలో డ్రగ్స్ ప్యాకెట్లను వదిలి వెళ్లిన సంఘటనలు సైతం భద్రతా సంస్థలను ఆశ్చర్యపరిచాయి.

నేల (మట్టి) అవసరం లేకుండా కేవలం పోషకాలతో కూడిన నీటిలోనే ఇండోర్ పద్ధతిలో పెంచే ఈ హైడ్రోపోనిక్ గంజాయిలో మత్తును కలిగించే మూలకాలు అత్యధిక శాతంలో ఉంటాయి. అందుకే దీనికి అంతర్జాతీయ డ్రగ్స్ మార్కెట్లో కళ్లు చెదిరే రేటు పలుకుతోంది. విదేశాల్లో సులభంగా లభించే ఈ ప్రమాదకరమైన మత్తును గుట్టుచప్పుడు కాకుండా భారతీయ నగరాలకు చేరవేసి, యువతను బలిపశువులను చేయడమే లక్ష్యంగా అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్లు పనిచేస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One