Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపు కలకలం

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపు కలకలం

నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్ నుండి శంషాబాద్‌కు వస్తున్న కోలాలంపూర్ ఎయిర్వేస్ విమానంలో బాంబు ఉన్నట్లుగా బెదిరింపు మెయిల్ రావడంతో హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమర్ కేర్‌కు ఓ అగంతకుడు మెయిల్ పంపిస్తూ, విమానంలో మానవరహిత బాంబు పెట్టామని, అది ఎప్పుడైనా పేల్చివేస్తామని హెచ్చరించాడు. ఈ సమా చారం అందుకున్న వెంటనే ఎయిర్‌పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే భద్రతా చర్యలు చేపట్టారు. విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్‌లో విమానం దిగిన తర్వాత ఐసోలేషన్ బేకు తరలించారు.

విమానం దిగగానే ప్రయాణికులను సురక్షితంగా తరలించారు. అనంతరం బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, సిఐఎస్‌ఎఫ్ భద్రతా సిబ్బంది సంయు క్తంగా విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రయాణికులను సురక్షి తంగా దింపి ప్రత్యేకంగా పరిశీలనకు పంపినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఈ మెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One