రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు మరోసారి 'బ్యాంకాక్ స్పెషల్ ప్యాకేజ్' దొరికింది. బ్యాంకాక్ నుంచి శంషాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడు ఎయిర్‌పోర్ట్ లో చాలా కూల్‌గా బయటికి వెళ్లిపోదామనుకున్నాడు.
కానీ కస్టమ్స్ అధికారుల కన్ను పడగానే కథ మొత్తం మారిపోయింది. 'రొటీన్ చెకింగ్ మాత్రమే సార్' అంటూ బ్యాగ్ ఓపెన్ చేయించగా… అందులో ఉన్న సామాను చూసి అధికారులు కూడా ఒక్క సారిగా షాక్ అయ్యారు. బట్టలు, చాక్లెట్లు, గిఫ్టులు ఉంటాయని అనుకున్న బ్యాగ్‌లో ఏకంగా 10 కిలోల గంజాయి ప్యాకెట్లు కనిపించడంతో ఒక్కసారిగా షాక్ గురి అయ్యారు. దీంతో అక్కడ కొత్తసేపు హడావిడి నెలకొంది.
'టూర్ ముగించు కుని వచ్చాడనుకుంటే… ఫుల్ బిజినెస్ ట్రిప్ చేసి వచ్చాడే!' అంటూ అక్కడి సిబ్బంది కూడా సెటైర్లు వేసుకున్నట్టు సమాచారం. అధికారులు వెంటనే ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ సుమారు రూ.10 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అంత విలువైన 'సరుకు'తో వచ్చిన ప్రయాణికుడు మాత్రం కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కి ఇప్పుడు విచారణ గదిలో కూర్చున్నాడు. ఇక సోషల్ మీడియాలో ఈ ఘటనపై నెటిజన్లు కూడా తమదైన స్టైల్లో కామెంట్లు పెడుతున్నారు. 'బ్యాంకాక్ నుంచి సూట్‌కేస్‌లో షాపింగ్ కాదు… షాకింగ్ తీసుకొ చ్చాడు!'అంటూ ట్రోల్స్ వైరల్ అవుతు న్నాయి. ప్రస్తుతం ఆ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు లోతుగా విచారిస్తున్నారు.
ఈ గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరికి చేరాల్సింది? ఈ వ్యవహారంలో ఇంకెవరెవరు ఉన్నారు? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

