Tuesday, 04 Aug, 4.28 pm తెలుగు వన్

సినిమా వార్తలు
శర్వానంద్ కొత్త సినిమాకు సంతకం చేశాడు

ఇటీవల హీరో నిఖిల్ 20వ సినిమాని నిర్మించనున్నట్లు శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి (ఏషియన్ గ్రూప్ యూనిట్‌) ప్రకటించింది. తాజాగా, హీరో శర్వానంద్‌తో ఓ సినిమా నిర్మించనున్నట్లు ఆ సంస్థ అధినేత నారాయణ్ దాస్ కె. నారంగ్ తెలిపారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన డైరెక్టర్‌, తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించనున్నారు. ఒకదాని తర్వాత ఒకటిగా చిత్రాలు నిర్మించేందుకు శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి ప్లాన్ చేస్తోంది.

శర్వానంద్ ప్రస్తుతం 'శ్రీకారం' చిత్రంతో పాటు ఒక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రాన్ని ఏక కాలంలో చేస్తున్నారు. మరోవైపు నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరి' అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను ఏషియన్ సినిమాస్ నిర్మిస్తోంది. దీని షూటింగ్ ముగింపు దశలో ఉంది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu One
Top