Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శోభన్ బాబు మూవీ షూటింగ్‌లో అలీకి ప్రమాదం!

శోభన్ బాబు మూవీ షూటింగ్‌లో అలీకి ప్రమాదం!

కూకు విత్ జాతిరత్నాలు షోలో ఈ వారం ఫారెస్ట్ థీమ్ ఇచ్చారు. ఇక క్షణక్షణం మూవీలో "కన్యాకుమారి" అనే సాంగ్ తో జడ్జెస్ అంతా ఎంట్రీ ఇచ్చారు.

ఇక సంజయ్ తుమ్మ ఐతే "నాకు అడవిలో తప్పిపోవాలని ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు టార్జాన్ సినిమా చూసి అక్కడి నుంచి అలా ఉండాలని కోరిక" అని చెప్పారు. ఇక ఆలీ తన ఎక్స్పీరియన్స్ ని చెప్పుకొచ్చారు. "టార్జాన్ అంటే గుర్తుకొచ్చింది.

శోభన్ బాబు గారి సినిమా అడవి దొరలో నేను టార్జాన్ వేషం వేసాను. అదేంటంటే నేను తాడు పట్టుకుని వెళ్లి ఏనుగు మీద కూర్చోవాలి. వెళ్ళేది డూప్ తో తీయించారు. నాకు మోకాలి వరకు తోలు లాంటిది ఇచ్చారు.

ఇక అక్కడి నుంచి కాలి కింద వరకు ఏమీ లేదు. అలీ రెడీనా అన్నారు. నేను కూడా రెడీ అని చెప్పాను. అలా తాడు పట్టుకుని వెళ్లి ఏనుగు మీద కూర్చున్నా.

నాకు తెలీదు ఏనుగు వెంట్రుకలు ముల్లులా ఉంటాయి. తాడు పట్టుకుని వెళ్లడం మాత్రం ఓ ఓ ఓ అంటూ వెళ్లాను. ఇక ఏనుగు మీద కూర్చోగానే నా ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోయింది. కట్ .

మెల్లిగా లేచాను. కింద కూర్చొనే చోట అంతా రక్తం. మీకు కూడా ఒకసారి" అంటూ అలీ సంజయ్ తుమ్మతో మీకు కూడా అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అవ్వాలి అన్నట్టు చెప్పుకొచ్చారు. ఇక మరో జడ్జ్ శ్రీదేవి ఐతే "అయ్యో నేను ఊహించుకుంటున్నాను వద్దు." అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One