Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీరాములయ్య సినిమా ఓపెనింగ్ లో పేలుడు!

శ్రీరాములయ్య సినిమా ఓపెనింగ్ లో పేలుడు!

ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్స్ తో తిరిగి వాళ్ళ గురించి వాళ్ళ లైఫ్ లో చేసిన మంచి పనుల గురించి ఇంటర్వ్యూస్ లో చెప్తూ ఉంటారు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు.

ఐతే ఆయనకు పరిటాల రవి, హీరో మోహన్ బాబు మధ్య జరిగిన విషయం గురించి అలాగే చిరంజీవి తనను ఎలా ఆదరించారు అనే విషయాన్నీ షేర్ చేసుకున్నారు ప్రభు రీసెంట్ గా ప్రసారమైన సర్కార్ ఎపిసోడ్ లో. "నేను ఇంకో ఇంటరెస్టింగ్ విషయం చెప్పాలనుకుంటున్నాను... అది 1997 రామానాయుడు స్టూడియోలో శ్రీరాములయ్య సినిమా ఓపెనింగ్. నేను వెనక స్కూటర్ మీద బయలుదేరాను.

నన్ను దాటుకుని ఈటీవీ వ్యాన్ వెళ్తోంది. నేను పరిటాల రవి గారిని, మోహన్ బాబు గారిని చూసి అన్నయ్య వస్తాను అని చేయూపాను . డ్రైవింగ్ సీట్ లో ఉన్న పరిటాల రవి గారు తనను అనుకుని నా వైపు ఒక్క క్షణం తిరిగి ఆ ఒకే తమ్ముడు అన్నారు. ఆ అన్న టైములో చిన్న గేర్ చేంజ్.

దాంతో ఈ కార్ కొంచెం వెనకబడింది. ఈటీవీ స్పాట్ లోకి వెళ్ళింది. నేను ఈటీవీ వ్యాన్ ని ఓవర్ టేక్ చేసి ముందుకు వెళ్ళిపోయాను. అంతే ఒక్క సెకెన్ లో పేలిన కార్ బాంబు పేలుడుకు 26 మంది స్పాట్ డెడ్ .

తెగిపోయిన చెయ్యి ఒకటి వచ్చి నా స్కూటర్ మీద పడి రక్తం నా మొహాన చిందింది. పోలీసులు నా స్కూటర్ ని పంచానామాలో పెట్టారు. ఎక్కడికి వెళ్ళాలో తెలీట్లేదు. అలా నడుచుకుంటూ నడుచుకుంటూ ఒక ఇంటికి వెళ్లాను.

నన్ను చూసి ఏంటి ప్రభు ఏంటి వాలకం, ఏమయ్యింది అని వాకబు చేసిన వ్యక్తి ఎవరో కాదు చిరంజీవి గారు. రా ప్రభు అని ఇంట్లోకి తీసుకెళ్లారు. ఏమయ్యింది ఏంటిలా జరిగింది అని అడిగారు. మొత్తం జరిగింది చెప్పాను. నిజంగా ఆ ఘటన నుంచి బయట పడ్డావ్ అదృష్టవంతుడివి అన్నారు. ఆ టైములో అలా వెళ్లినా ఆయన నన్ను చూసి నన్ను దగ్గరకు తీసుకున్న వైనం నా జీవితంలో అస్సలు మర్చిపోలేను." అని చెప్పుకొచ్చారు ప్రభు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One