ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసేందుకు మంత్రులు సీతక్క, కొండా సురేఖకు రాఖీ పండుగ వేదికగా మారింది. ఇటీవల ముఖ్య మంత్రి కుటుంబానికి సంబంధించిన వ్యాఖ్యల నేపథ్యంలో కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్న మంత్రి కొండా సురేఖకు రాఖీ పండుగ కాస్త ఊరటనిచ్చినట్టయింది.
కొద్ది రోజులుగా వరంగల్‌లోనే ఉన్న మంత్రి సురేఖ.. రాఖీ పండుగ సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చారు. అనంతరం జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు. మంత్రి సీతక్క కూడా సీఎంకు రాఖీ కట్టారు.
ఇటీవల చోటుచే సుకున్న పరిణామాలతో రాజకీయ వర్గాల్లో కొంత గంభీర వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. రాఖీ పండుగ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఒకే వేదికపై కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా వారి ముఖా ల్లో చిరునవ్వులు కనిపించడంతో వాతావరణం కొంత ఉల్లాసంగా మారినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగింది. ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డికి మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి, కమిషన్ సభ్యులు కూడా రాఖీ కట్టారు.
వివిధ కార్పొరే షన్‌ల చైర్మన్లు, బ్రహ్మకు మారీస్ ప్రతినిధులు, మహిళా కాంగ్రెస్ నాయకులు సీఎంను కలిసి రాఖీ పండుగ శుభాకాం క్షలు తెలిపారు. మలక్‌పే ట్‌లోని ప్రభుత్వ బాలికల అంధుల పాఠశాలకు చెందిన విద్యార్థినులు కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా సీఎం వారిని ఆప్యాయం గా పలకరించారు. రాజకీయంగా కీలక పరిణామాల మధ్య వచ్చిన రాఖీ పండుగ.. ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య సాన్నిహిత్యాన్ని చాటే సందర్భంగా మారిందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. Ministers Seethakka, Konda Surekha tied Rakhi to CM Revanth Reddy, Rakhi festival, Jubilee Hills, Commission Chairperson Gadwala Vijayalakshmi, Malakpet, Hyderabad, Telugu news, Telugu one

