Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీఎస్‌కేలో 25 శాతం షేర్ అడిగిన ధోనీ?

సీఎస్‌కేలో 25 శాతం షేర్ అడిగిన ధోనీ?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్, ఎంఎస్ ధోనీల బంధం అత్యంత బలమైనది. ఐదు ఐపీఎల్ ట్రోఫీలు అందించి సీఎస్‌కే గుర్తింపుగా మారిన ఎంఎస్ ధోనీకి, ఆ ఫ్రాంచైజీకి మధ్య విడదీయరాని అనుబంధం ఉంది.

అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఒక సంచలన వార్త తీవ్ర కలకలం రేపింది. చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్‌ను ధోనీ ఏకంగా 25 శాతం వాటా (25% Stake) డిమాండ్ చేశాడని, ఆ తర్వాత అది 20 శాతానికి తగ్గిందని, చివరకు 5.5 శాతం లేదా 3.5 శాతం వాటాపై చర్చలు జరిగాయని కొన్ని రిపోర్టులు ప్రచారం చేశాయి. ఈ వార్తలు క్రికెట్ ప్రపంచంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీయగా, క్రికెట్ విశ్లేషకుడు మరియు మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఈ వివాదంపై స్పందిస్తూ షాకింగ్ క్లారిటీ ఇచ్చారు. ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు.

ఐపీఎల్ ఫ్రాంచైజీల మార్కెట్ విలువను లెక్కలోకి తీసుకుంటే ఇలాంటి డిమాండ్లు అసాధ్యమని ఆయన విశ్లేషించారు. ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీ వాల్యుయేషన్ దాదాపు 1.7 బిలియన్ డాలర్ల నుంచి 1.8 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 16,000 కోట్లు) పరిధిలో ఉందనే విషయాన్ని ఆకాష్ గుర్తుచేశారు. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన సీఎస్‌కే బ్రాండ్ విలువ కూడా అదే స్థాయిలో బిలియన్ డాలర్లలలో ఉంటుంది.

అంతటి భారీ వ్యయం కలిగిన ఫ్రాంచైజీలో 25 శాతం వాటా అంటే దాని విలువ సుమారు 400 మిలియన్ డాలర్లు (రూ. 3,300 కోట్లకు పైగా) ఉంటుంది. అంత పెద్ద మొత్తాన్ని ఉచితంగా ఇవ్వడం గానీ, 400 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టకుండా 25 శాతం వాటా దక్కడం గానీ వ్యాపార దృష్ట్యా ఏమాత్రం సాధ్యం కాదని చోప్రా తేల్చి చెప్పారు. aakash chopra reacts to dhoni csk share rumours,did dhoni ask for 25 percent stake in csk.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One