Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
SRH ఓనర్ కావ్య మారన్‌తో అనిరుధ్ పెళ్ళి ముహూర్తం ఫిక్స్

SRH ఓనర్ కావ్య మారన్‌తో అనిరుధ్ పెళ్ళి ముహూర్తం ఫిక్స్

మ్యూజిక్ డైరెక్టర్‌ రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ (Anirudh), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) కో-ఓనర్, సన్ టీవీ నెట్‌వర్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కావ్య మారన్ (Kavya Maran) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా వార్తలు షికార్లు చేస్తున్నాయి.

కొంతకాలంగా ప్రేమలో ఉన్న అనిరుధ్, కావ్య మారన్.. ఈ ఏడాది నవంబర్ లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని, వీరిద్దరూ త్వరలోనే అధికారికంగా తమ వివాహ బంధాన్ని ప్రకటించబోతున్నారంటూ వస్తున్న వార్తలు అటు సినీ ప్రియులను, ఇటు క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి ఈ క్రేజీ కాంబినేషన్‌పై రూమర్స్ రావడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది కూడా సోషల్ మీడియాలో వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై పెద్ద ఎత్తున పోస్టులు దర్శనమిచ్చాయి.

ఆ సమయంలో అనిరుధ్, కావ్య మారన్ ఇద్దరూ న్యూయార్క్ నగరంలో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కనిపించారంటూ కొన్ని ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే, గతంలో తన పెళ్లిపై వచ్చిన ఇలాంటి వార్తలపై అనిరుధ్ రవిచందర్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా చాలా కూల్‌గా స్పందించారు. "lol .. Chill out guys" (నవ్వుతూ..

కాస్త ప్రశాంతంగా ఉండండి ఫ్రెండ్స్) అంటూ ఒక చిన్న ట్వీట్‌తో ఆ రూమర్స్‌ను చాలా తేలికగా కొట్టిపారేశారు. కానీ, ఇప్పుడు మరోసారి వీరిద్దరి పెళ్లి అంశం తెరపైకి రావడంతో ఈసారి ఇందులో ఎంతవరకు నిజం ఉందో అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇక ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో మీమ్స్ రాయుళ్లు పండగ చేసుకుంటున్నారు. ఈ పవర్‌ఫుల్ జోడీపై నెటిజన్లు రకరకాల ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఒకవేళ అనిరుధ్ నిజంగానే కావ్య మారన్‌ను పెళ్లాడితే, భవిష్యత్తులో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఆడే ప్రతి ఐపీఎల్ (IPL) మ్యాచ్‌లకు అనిరుధ్ లైవ్ మ్యూజిక్ అందిస్తాడేమోనని కొందరు జోకులు పేలుస్తున్నారు. అంతేకాకుండా, అనిరుధ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు పెద్ద అభిమాని కావడంతో, ఐపీఎల్ ప్రత్యర్థుల మధ్య ఈ సరికొత్త లవ్ స్టోరీ ఎలా సాధ్యమంటూ క్రికెట్ ఫ్యాన్స్ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One