Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్టార్ హోదా పక్కన పెట్టి అభిమానికి క్షమాపణలు చెప్పిన స్టార్ హీరో

స్టార్ హోదా పక్కన పెట్టి అభిమానికి క్షమాపణలు చెప్పిన స్టార్ హీరో

బాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో వరుణ్ ధావన్ సినిమాలతోనే కాకుండా తన డౌన్ టు ఎర్త్ స్వభావంతోనూ ప్రేక్షకులకు బాగా దగ్గరవుతుంటారు. సాధారణంగా కొందరు స్టార్స్ తమను చూడటానికి వచ్చే అభిమానులను పెద్దగా పట్టించుకోరు.

కానీ వరుణ్ ధావన్ మాత్రం తాజాగా తనపై చూపించిన ప్రేమాభిమానాలకు ఫిదా అవ్వడమే కాకుండా, ఒక సాధారణ అభిమాని కోసం సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పి అందరి మనసులు గెలుచుకున్నారు. ప్రస్తుతం వరుణ్ ధావన్ తన తాజా చిత్రం 'హై జవాని తో ఇష్క్ హోనా... హై' ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా చిత్ర బృందం ఇటీవల లక్నో నగరంలో ఒక భారీ ప్రమోషనల్ ఈవెంట్‌ను నిర్వహించింది.

అయితే ఈ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఆ సమయంలో ఒక లేడీ ఫ్యాన్ తన అభిమాన హీరోను చూడటానికి దాదాపు ఐదు గంటల పాటు నిరీక్షించింది. కానీ వేదికపై వరుణ్ కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఉండి వెళ్ళిపోవడంతో ఆమె తీవ్ర నిరాశకు గురైంది. తన బాధను వివరిస్తూ సదరు అభిమాని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసింది.

ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్‌గా మారడంతో హీరో వరుణ్ ధావన్ దృష్టికి వెళ్ళింది. దీనిపై ఆయన వెంటనే స్పందించారు. ఆ అభిమాని పోస్ట్‌కు రిప్లై ఇస్తూ.. "నన్ను క్షమించండి, మీకు ఆటోగ్రాఫ్ ఇవ్వలేకపోయాను.

అక్కడ జనం ఎక్కువ కావడంతో పోలీసులు మమ్మల్ని త్వరగా పంపించేశారు" అంటూ అసలు కారణాన్ని వివరించారు. అంతేకాకుండా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ప్రత్యేకంగా ఒక వీడియోను షేర్ చేస్తూ లక్నో ఫ్యాన్స్ అందరికీ సారీ చెప్పారు. ఇక ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్ విషయానికి వస్తే.. వరుణ్ ధావన్ తన తండ్రి, టాలెంటెడ్ డైరెక్టర్ డేవిడ్ ధావన్ కాంబినేషన్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ సరికొత్త రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో వరుణ్ సరసన టాలీవుడ్ బ్యూటీస్ మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు. లక్నో ఈవెంట్‌లో వరుణ్‌తో పాటు మృణాల్ కూడా సందడి చేసింది. స్టార్ హోదాలో ఉండి కూడా ఒక సామాన్య అభిమాని ఆవేదనను అర్థం చేసుకుని, వరుణ్ ధావన్ రెస్పాండ్ అయిన తీరుపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. వరుణ్ మంచి మనసున్న హీరో అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. భవిష్యత్తులో లక్నోలో మరింత పెద్ద వేదికపై, మెరుగైన ఏర్పాట్లతో ఈవెంట్ నిర్వహిస్తానని వరుణ్ హామీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One