Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Sudheer Joker జోకర్గా మారిన సుడిగాలి సుధీర్!

Sudheer Joker జోకర్గా మారిన సుడిగాలి సుధీర్!

సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) హీరోగా "సుధీర్ జోకర్" (Sudheer Joker) అనే కొత్త చిత్రం రాబోతోంది. బిగ్ బాస్ ఫేమ్ అయేషా ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అవ్వబోతుంది.

ఈ చిత్రంలో అభిరామి,మురళీ శర్మ, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, విష్ణు ఓయ్, మురళీధర్ గౌడ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. రేపు(మే 19) హీరో సుడిగాలి సుధీర్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఈ రోజు "సుధీర్ జోకర్" టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్లేయింగ్ కార్డ్స్ తో ఉన్న సుడిగాలి సుధీర్ లుక్ ఆకట్టుకుంది. రేపు ఈ సినిమా బాంగర్ రిలీజ్ తో పాటు ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్ కూడా జరగబోతోంది. కంప్లీట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా "సుధీర్ జోకర్" సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా అహ్మద్ షెరీఫ్, ఎడిటర్ గా ధర్మేంద్ర కాకర్ల వ్యవహరిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One