Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
sushmita sen సుష్మితాసేన్‌ ఒక గోల్డ్ డిగ్గర్! డబ్బు కోసం ఆశపడే  రిలేషన్ లోకి వచ్చింది!

sushmita sen సుష్మితాసేన్‌ ఒక గోల్డ్ డిగ్గర్! డబ్బు కోసం ఆశపడే రిలేషన్ లోకి వచ్చింది!

మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్(sushmita sen)కి భారతీయ సినీ రంగంలో సుదీర్ఘమైన సినీ ప్రస్థానం ఉంది. తెలుగులో కింగ్ నాగార్జునతో రక్షకుడు మూవీలో చేసి తెలుగు నాట కూడా అభిమాన గణాన్ని సొంతం చేసుకుంది.

కొన్ని సంవత్సరాల క్రితం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)మాజీ ఛైర్మన్, లలిత్ మోడీ(lalit modi)ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఒకటి చేసాడు. సదరు పోస్ట్ లో సుష్మితా సేన్‌తో నేను ప్రేమలో ఉన్నాను. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నానంటూ తెలిపాడు. దీంతో ఆ ఒక్క పోస్ట్ యావత్ దేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

లలిత్ మోడీ సంపదని చూసే సుష్మితా సేన్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళిందంటూ సుష్మితాని'గోల్డ్ డిగ్గర్' (డబ్బు కోసం ఆశపడే వ్యక్తి) అని పిలుస్తూ ట్రోల్ చేశారు. కానీ ఆ తర్వాత ఇద్దరు బ్రేక్ అప్ అయ్యారు.ఈ బ్రేక్ అప్ పై కూడా ఎవరకి వాళ్ళు రైటర్స్ గా మారి తోచిన కథలని అల్లుకున్నారు. తాజాగా బ్రేకప్ వెనుక ఉన్న అసలు నిజాలపై లలిత్ మోడీ స్పందించారు ప్రముఖ మీడియా ప్లాట్‌ఫారమ్ 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతు సుష్మితాని 'గోల్డ్ డిగ్గర్' అని సంబోధించడం అత్యంత దారుణమైన విషయం ఆమె ఎంతో అందమైన, అత్యంత విజయవంతమైన, పూర్తిగా స్వయంకృషితో పైకి ఎదిగిన మహిళ. ఆమె ఎవరి డబ్బు పైనో ఆధారపడే వ్యక్తి కాదు.

తన సొంత కష్టంతోనే ఎంతో సంపదని, గౌరవాన్ని సంపాదించుకుంది. నిజం చెప్పాలంటే, తనకు తెలిసిన వారిలో ఎవరికీ లేనన్ని వజ్రాలు సుష్మితా సేన్ దగ్గర ఉన్నాయి. సొంతంగా డైమండ్ స్టోర్స్ కూడా ఉన్నాయి. ఇద్దరం కలిసి బయటకు వెళ్లినప్పుడు చాలా సందర్భాల్లో ఖర్చులన్నీ సుష్మితానే భరించేది.

ఆమె ఎవరి దగ్గర నుండి ఏమీ ఆశించదు. అంతా తనే చూసుకుంటుంది. మేము డేటింగ్‌లో ఉన్నప్పుడు నిజాయితీగా చెప్పాలంటే నేను ఒక 'పోషించబడే ప్రియుడు' లాగా ఫీలయ్యేవాడిని. ఆమె గోల్డ్ డిగ్గర్ కాదు, లలిత్ మోడీనే అసలైన డైమండ్ డిగ్గర్.

ఎందుకంటే సుష్మితా ఒక స్వచ్ఛమైన వజ్రం లాంటిది అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఒక ఒంటరి తల్లిగా తన ఇద్దరు కుమార్తెలు రేనే, అలీషాలను ఆమె పెంచిన విధానం అసాధారణమైనదని ప్రశంసించారు. Also read: krithi shetty: ఉప్పెన భామ కృతిశెట్టి సంచలన వ్యాఖ్యలు.. మూవీ ప్లాప్ అవుతుందని తనకి తెలుసా!

అలాగే 2022లో వైరల్ అయిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వెనుక ఉన్న అసలు కథని కూడా లలిత్ మోడీ ఈ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. లండన్‌కి ప్రయాణిస్తున్న విమానంలో ఇద్దరి మధ్య చిన్న వాదన జరిగింది. ఆ సమయంలో నేను సరదాగా ఆ ఫోటోలను పోస్ట్ చేస్తానని అనగా, సుష్మితా నమ్మలేదని చెప్పారు. ఆమె వద్దంటున్నా నేను పోస్ట్ బటన్ నొక్కేశాను.

మేము విమానం దిగేసరికి సోషల్ మీడియాలో ఒక పెద్ద తుఫానే చెలరేగింది . గూగుల్ 'ఇయర్ ఇన్ సెర్చ్ 2022' జాబితా ప్రకారం, ఆ ఏడాది భారతదేశంలో అత్యధికంగా శోధించబడిన వ్యక్తులలో నేను 4వ స్థానంలో, సుష్మితా సేన్ 5వ స్థానంలో నిలిచారు. దీన్ని బట్టి ఆ పోస్ట్ ఎంతటి సంచలనం సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మేమిద్దరం విడిపోయినప్పటికీ, ఇప్పటికీ మంచి స్నేహితులుగానే ఉంటూ ఒకరినొకరు గౌరవించుకుంటామని లలిత్ మోడీ చెప్పుకొచ్చాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One