Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టాక్సిక్ ని ఉద్దేశించే కదా యశ్ పై సుమలత కామెంట్స్ వైరల్

టాక్సిక్ ని ఉద్దేశించే కదా యశ్ పై సుమలత కామెంట్స్ వైరల్

సుమలత అంబరీష్.. కన్నడ రాష్ట్ర కోడలుగా ఉన్నా కూడా తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేని విధంగా అద్భుతమైన సినిమాలు చేసిన అచ్చ తెలుగు నటి. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా టాక్సిక్ ని ఉద్దేశిస్తూ యశ్ కి మద్దతుగా నిలిచారు.

ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో 'టాక్సిక్' చిత్రంలో యశ్ నటన అత్యంత అద్భుతంగా, మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఎప్పుడూ రొటీన్ మార్గాన్ని ఎంచుకోకుండా, కొత్త దారులని వెతుక్కునే ధైర్యశాలి యశ్. "ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి సాధించిన అపారమైన విజయం, ఆయన సాధిస్తున్న ఉన్నత ఎదుగుదల కొందరిలో తీవ్రమైన అసూయని పెంచుతుంది" సమాజంలో యశ్ కు ఉన్న స్థాయిని చూసి ఓర్వలేక కొందరు కావాలనే టాక్సిక్ పై దుష్ప్రచారానికి తెగబడుతున్నా రు. అయితే యశ్ ఇలాంటి చవకబారు కామెంట్లను ఏమాత్రం పట్టించుకోడు.

'టాక్సిక్' లాంటి విజువల్ వండర్ బహుశా తన కాలం కంటే చాలా ముందుకొచ్చిన చిత్రం కావచ్చని, లేదా కొందరు ఈ కథను, ఇందులో చూపించిన విధానాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక తప్పుగా అంచనా వేసి ఉండవచ్చు. ఇది కేవలం ఒక తాత్కాలిక అలజడి మాత్రమే. ప్రయోగం చేయడానికి వెనకాడని అసలైన నటుడు యశ్ ఖచ్చితంగా విమర్శలన్నింటినీ అధిగమించి మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాడు.అని చెప్పడమే కాకుండా యష్ ని ఉద్దేశిస్తూ 'నువ్వు మళ్లీ బంతిని మైదానం బయటకు కొడతావు.. రాబోయే రోజుల్లో మరింత బలంగా, మహోన్నత శక్తిగా తిరిగి వస్తావు" అని చెప్పడం సౌత్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. Also read: సంచలనం నమోదు కాబోతుందా: పూణేలో పవన్ ఫ్యాన్స్ పరిస్థితి ఇదే! [Toxic, Sumalatha, Trolls, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood]

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One