Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టాలీవుడ్ సరికొత్త విజువల్ వండర్ 'కరికాల' ఒకే ఏడాది రెండు పార్టులుగా రిలీజ్!

టాలీవుడ్ సరికొత్త విజువల్ వండర్ 'కరికాల' ఒకే ఏడాది రెండు పార్టులుగా రిలీజ్!

టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ తన కెరీర్‌లోనే ఎన్నడూ లేని విధంగా ఒక మైండ్ బ్లోయింగ్ విజువల్ వండర్‌తో మన ముందుకు రాబోతున్నారు. అదే 'కరికాల'. 'శంభాల' ఫేమ్ యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్న ఈ ఫాంటసీ అడ్వెంచర్..

ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. "రాజులు, సింహాలు, తోడేళ్లు, మాయలతో కూడిన ప్రపంచం" అంటూ మూవీ టైటిల్‌ను రివీల్ చేస్తూ తాజాగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. సందీప్ కిషన్ రాజు అవతారంలో గుర్రంపై కత్తి పట్టుకుని, సింహాన్ని తరుముతున్నట్టుగా ఉన్న పవర్‌ఫుల్ పోస్టర్ అదిరిపోయింది. ఈ టైటిల్ పోస్టర్‌తో ఒక్కసారి అంచనాల్ని రెట్టింపు చేసేశారు.

ఈ మూవీని రెండు పార్టులుగా మేకర్లు ప్లాన్ చేశారు. మొదటి చాప్టర్‌ 2027 జూలై 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, రెండో చాప్టర్ 2027 అక్టోబర్ 28న రానుంది. రెండు పార్టుల రిలీజ్ డేట్‌లను ఒకే సారి ప్రకటించడం చూస్తుంటే.. మేకర్స్ ఎంత క్లారిటీగా, ఎంత కాన్ఫిడెన్స్ తో ఉన్నారో అర్థమవుతోంది.

ఈ ప్రాజెక్ట్‌ ను షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్నారు. 'శంభాల' విజయం తర్వాత, దర్శకుడు యుగంధర్ ముని, షైనింగ్ పిక్చర్స్ బృందం ఈ 'కరికాల' ప్రాజెక్ట్‌ను మరింత భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. సరికొత్త ప్రపంచం, అద్భుతమైన కథనం, భారీ విజువల్స్ తో దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సోషియో-ఫాంటసీ అనుభవాన్ని అందించాలని మూవీ టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. Sundeep Kishan, Karikaala, First Look, Ugandhar Muni

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One