Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తాంబూలాలు విసిరేసిన అలకనంద గోదావరి సీరియల్‌లో ఊహించని ట్విస్ట్

తాంబూలాలు విసిరేసిన అలకనంద గోదావరి సీరియల్‌లో ఊహించని ట్విస్ట్

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -06 లో....జానూని మురళి ఆటపట్టిస్తుంటే సూర్య చూస్తాడు.

జానూ అక్కడ నుంచి వెళ్ళాక ఎందుకు అమ్మాయిని ఏడిపిస్తున్నావని అడుగుతాడు. ఆ తర్వాత జానూ వెళ్తు బై బావ అని అంటుంది. దాంతో వాళ్లిద్దరు బావామరదళ్ళు అని సూర్యకి అర్థమవుతుంది. ఇక మురళిని సూర్య పరిచయం చేసుకొని మాట్లాడి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత శంకర్ తన కుటుంబాన్ని తీసుకొని తోటకి వెళ్తాడు. అక్కడ వాళ్ళకి సర్ ప్రైజ్ చెయ్యాలని అనుకుంటాడు. అప్పుడే శంకర్ వాళ్ళ అక్క, ఇంకా మురళి వస్తారు. అందరు సరదాగా మాట్లాడుకుంటారు.

రేపు మా ఇంటికి భోజనానికి రావాలని వాళ్ళ అక్క అంటుంది. ఎందుకో చల్లకి వచ్చి ముంత దాస్తావ్.. మురళికి అలకనందని ఇచ్చి పెళ్లి చెయ్యమని అడగడానికే కదా వచ్చిందని పెద్దావిడ అంటుంది. మనం చిన్నప్పటి నుండి అనుకుంటుందే వాళ్ళకి పెళ్లి చేయడం కోసం వచ్చాడని శారద చెప్పగానే మురళి హ్యాపీగా ఫీల్ అవుతాడు.

మరొకవైపు అలకనంద నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పాలని అనుకుంటుంది. బావ నీతో మాట్లాడాలని నందు అనగానే మురళి సరే అని అంటాడు. ఇద్దరు పక్కకి వస్తారు. ఈ పెళ్లి ఇష్టం లేదని మురళికి నందు ఇండైరెక్ట్ గా చెప్తుంది..

కానీ తనకి అర్థం కాదు.. ఆ మాటలు విన్న జానూ వచ్చి నందుని పక్కకి పిలిచి మాట్లాడుతుంది. నువ్వు పెళ్లి ఇష్టం లేదని చెప్పాలనుకుంటున్నావు కదా నువ్వు చెప్తే ఫీల్ అవుతాడు. నేను చెప్తానని జానూ అంటుంది.

బావ జానూ చెప్పేది విను అని నందు అక్కడ నుంచి వెళ్తుంది. బావ నువ్వు పెళ్లి గురించి మాట్లాడుదాం అనుకున్నప్పుడు తాంబూలాలతో రావాలి కదా.. రేపు తాంబూలాలతో రా అని జానూ చెప్పగానే సరే అని మురళి అంటాడు. మరొకవైపు శంకర్ కొన్న తోటలో సింహాద్రి, సూర్య, తుఫాన్ ఉంటారు.

ఇంత మంచి తోటని మీ ఫ్రెండ్ కి కొనిచ్చావ్.. నాకు ఇస్తే రెసాట్ కట్టేదాన్ని అని భువన అంటుంది. నా ఫ్రెండ్ విషయంలో నేను స్వార్థంగానే ఉండను అమ్మ వాడికే ఈ తోట అని సింహాద్రి చెప్తాడు. ఆ తర్వాత తోటకి శంకర్ కుటుంబంతో పాటు వస్తాడు.

సింహాద్రి ఎదురుగా వస్తాడు. అన్నయ్య మీ తోట బాగుందని శారద అనగానే ఇంకా విషయం చెప్పలేదా అని సింహాద్రి అంటాడు. అది చెప్పడానికే తీసుకొని వచ్చానని శంకర్ అంటాడు. ఈ తోట మనమే కొన్నామని శంకర్ చెప్పగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు.

తరువాయి భాగంలో మురళి తాంబూలాలతో వస్తాడు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని నందు తాంబూలం కింద పడేస్తుంది. ఇదంతా నీ వల్లే అని జాను చెంపచెల్లుమనిపిస్తుంది నందు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One