Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తండ్రైన జబర్దస్త్ కమెడియన్!

తండ్రైన జబర్దస్త్ కమెడియన్!

బుల్లితెర మీద హాస్యం పండించి ఆడియన్స్ తో కెవ్వు కేక పెట్టించిన కెవ్వు కార్తీక్ అంటే తెలియని వాళ్ళు లేరు. ఇప్పుడు కార్తీక్ తండ్రయ్యాడు. ఆయన భార్య శ్రీలేఖ రీసెంట్ గా పండంటి బిడ్డను కన్నది.

కార్తీక్ ఈ విషయాన్నీ తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా షేర్ చేసాడు. "మేము అమ్మ, నాన్న అయ్యాము... చిన్ని పాదాలు మా జీవితాల్లోకి అడుగుపెట్టి, మా ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చేశాయి.జీవితంలో గాయాలు మాన్పడానికి దేవుడు ఎదో ఒక మార్గం చూపిస్తాడు. మాకు మార్గదర్శి అయిన వెలుగును కోల్పోయిన సరిగ్గా రెండేళ్ల తర్వాత, మా జీవితాల్లోకి ఒక కొత్త వెలుగు ప్రవేశించింది.

మేము తల్లిదండ్రులయ్యామని ప్రకటించడానికి ఎంతో సంతోషిస్తున్నాము . తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు." అంటూ తన ఇన్స్టాగ్రామ్ లో oka పోస్ట్ పెట్టాడు కెవ్వు కార్తీక్. ఇక ప్రియాంక సింగ్ , జబర్దస్త్ అవినాష్, గెటప్ శీను, మహిశివన్, నటి సురేఖావాణి, టేస్టీ తేజ, బుల్లితెర నటి శిరీష, పంచ్ ప్రసాద్-సునీత, సత్యశ్రీ, ధరణి ప్రియా, షబీనా, పాగల్ పవిత్ర, సుష్మ కిరణ్, సావిత్రి చొక్కారావు, తాగుబోతు రమేష్, రసజ్ఞ రీతూ, నటుడు చింటూ, జబర్దస్త్ అభి వంటి వాళ్లంతా కెవ్వు కార్తీక్ కి విషెస్ చెప్తున్నారు. ఐతే పుట్టింది అమ్మాయా , అబ్బాయా గెస్ చేయగరాలా ? అంటూ ఆడియన్స్ ని అడిగాడు. ఐతే చాలామంది ఫాన్స్ అండ్ కో-ఆర్టిస్టులంతా అమ్మాయి పుట్టింది...మీ అమ్మ పుట్టింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కెవ్వు కార్తీక్ వాళ్లందరికీ థాంక్యూ చెప్పి త్వరలోనే ఎవరు పుట్టారు అనేది రివీల్ చేస్తానని చెప్పాడు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One