Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలుగులోకి వస్తున్న సన్నీ లియోన్ క్రేజీ రొమాంటిక్ షో

తెలుగులోకి వస్తున్న సన్నీ లియోన్ క్రేజీ రొమాంటిక్ షో

యువతను విపరీతంగా ఆకట్టుకుంటూ హిందీలో విజయవంతంగా దూసుకుపోతున్న క్రేజీ లవ్ అండ్ రొమాంటిక్ రియాలిటీ షో ఎంటీవీ స్ప్లిట్స్‌విల్లా (MTV Splitsvilla).

ఇటీవల ముగిసిన తన 'MTV Splitsvilla X6' (సీజన్ 16) తో దేశవ్యాప్తంగా భారీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. హిందీ వెర్షన్‌కు లభించిన రెస్పాన్స్ ను దృష్టిలో ఉంచుకుని, ఇప్పుడు ఈ షో మేకర్స్ ప్రాంతీయ భాషలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగానే తెలుగు ప్రేక్షకుల కోసం ఈ పాపులర్ షోను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. తెలుగు రియాలిటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను సరికొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు 'ఎంటీవీ స్ప్లిట్స్‌విల్లా తెలుగు' (MTV Splitsvilla Telugu) గ్రాండ్ డెబ్యూకు అంతా సిద్ధమైంది.

తెలుగు డిజిటల్ స్క్రీన్‌లపై సరికొత్త రొమాన్స్, లవ్, టాస్క్‌లు, డ్రామా, అసూయ వంటి నవరసాల కలయికతో ఈ రియాలిటీ షో సాగనుంది. హిందీలో ఈ షోకు ఉన్న క్రేజ్ మనందరికీ తెలిసిందే, ఇప్పుడు అదే మ్యాజిక్ ను డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ తో టాలీవుడ్ నేటివిటీకి తగినట్లుగా డిజైన్ చేస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'డిస్నీ ప్లస్ హాట్‌స్టార్' (Disney+ Hotstar) వీక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. సాధారణంగా తెలుగులో బిగ్ బాస్ వంటి బిగ్గెస్ట్ రియాలిటీ షోలకు లభించే ఆదరణ చాలా ఎక్కువ.

అలాంటిది పూర్తిగా లవ్, డేటింగ్ అండ్ కాంపిటీషన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఈ స్ప్లిట్స్‌విల్లా తెలుగు వెర్షన్ యువతకు ఒక పర్ఫెక్ట్ ఐ ఫీస్ట్‌గా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ప్రయాణంలో అత్యంత ఆకర్షణీయమైన అంశం ఏమిటంటే, బాలీవుడ్ గ్లామర్ క్వీన్ సన్నీ లియోన్ (Sunny Leone) ఈ తెలుగు వెర్షన్‌లోనూ తన మార్క్ హోస్టింగ్‌తో అలరించబోతున్నట్లు టాక్. హిందీలో సుదీర్ఘకాలంగా స్ప్లిట్స్‌విల్లాను విజయవంతంగా నడిపిస్తున్న సన్నీ లియోన్, ఇప్పుడు హాట్‌స్టార్ రియాలిటీ వేదికగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు తమ పర్ఫెక్ట్ లవ్ పార్ట్‌నర్‌ను వెతుక్కునే క్రమంలో ఎదుర్కొనే సవాళ్లు, వారి మధ్య వచ్చే మనస్పర్థలు, హార్ట్ బ్రేకింగ్ మూమెంట్స్ ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తాయి.

గ్లామరస్ టాస్క్‌లు, అద్భుతమైన లొకేషన్లు, లవ్ గేమ్స్ ఈ షో రేటింగ్‌ను అమాంతం పెంచేస్తాయని మేకర్స్ భావిస్తున్నారు. త్వరలోనే ఈ షో ప్రారంభ తేదీ, కంటెస్టెంట్ల వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు. తెలుగు బుల్లితెరపై సరికొత్త రొమాంటిక్ సంచలనానికి తెరలేపబోతున్న ఈ స్ప్లిట్స్‌విల్లా తెలుగు ఎంట్రీపై యువతలో అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One