Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీనేజ్ ప్రేమికులకు ఉరటనిచ్చేలా నేపాల్‌లో కొత్త చట్టం

టీనేజ్ ప్రేమికులకు ఉరటనిచ్చేలా నేపాల్‌లో కొత్త చట్టం

త్యాచార కేసులు నమోదు కాకుండా రోమియో జూలియట్ క్లాజ్ టీనేజ్ ప్రేమికులకు ఊరట నిచ్చేలా నేపాల్ దేశ ప్రభుత్వం ఒక సంచలన చట్టం తీసుకురాబోతోంది.మనేపాల్‌లోని బాలేంద్ర షా ప్రభుత్వం ఆ దిశగా చట్ట సవరణకు శ్రీకారం చుట్టబోతోండటం చర్చనీయాశంగా మారింది.

పరస్పర అంగీకారంతో ప్రేమ బంధాల్లో ఉండే టీనేజర్లపై ఆటోమేటిక్‌గా అత్యాచార కేసులు నమోదు కాకుండా నిరోధించేందుకు.. తమ దేశ అత్యాచార నిరోధక చట్టంలో ఒక ప్రత్యేకంగా రోమియో జూలియట్ క్లాజ్ తీసుకు రావాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రతిపాదిత సంస్కరణ ప్రకారం.. 16 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు గల జంటల మధ్య వయస్సు వ్యత్యాసం గరిష్టంగా మూడు సంవత్సరాల లోపు ఉంటే, వారి పరస్పర సమ్మతితో కూడిన సంబంధాలకు చట్టం నుంచి మినహాయింపు లభిస్తుంది.

అయితే ఇదే సమయంలో లైంగిక వేధింపులు, బలవంతపు చర్యలు, దోపిడీలకు పాల్పడితే మాత్రం కఠినమైన శిక్షలు యథాతథంగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. నేపాల్‌లో ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం.. 18 ఏళ్ల లోపు ఉన్న వారితో ఎలాంటి లైంగిక సంబంధం పెట్టుకున్నా, వారిద్దరి మధ్య పరస్పర అంగీకారం ఉన్నప్పటికీ దానిని అత్యాచారంగానే పరిగణిస్తారు. దేశంలో చట్టబద్ధమైన వివాహ వయస్సు మాత్రం 20 ఏళ్లుగా ఉంది.

ఈ నిబంధనల వల్ల క్షేత్రస్థాయిలో అనేక దారుణాలు జరుగుతున్నాయని న్యాయ నిపుణులు ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్ కాస్ట్ ప్రేమాయణాలు సాగించే జంటలు లేదా ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకునే టీనేజ్ జంటల విషయంలో.. వారి ప్రేమ ఇష్టం లేని అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయిలపై అత్యాచార కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు. ఇలా చట్టాన్ని మైనర్ల రక్షణ కోసం కాకుండా, యువ జంటలను శిక్షించడానికి, ప్రేమలను విడదీయడానికి ఆయుధంగా వాడుకుంటున్నారన్న అభిప్రాయం ఉంది.

ఆ క్రమంలో టీనేజ్ జంటలకు సంబంధించిన అనేక వివాదాస్పద కేసులు నేపాల్ కోర్టులకు చేరుతుండటంతో ఈ చట్ట సవరణ ప్రతిపాదన వేగవంతమైంది. దీనిపై నేపాల్ లా సెక్రటరీ మాట్లాడుతూ.. ఇలాంటి కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటాన్ని గమనించిన తర్వాతే ప్రభుత్వం ఈ రోమియో అండ్ జూలియట్ క్లాజ్ సిద్ధం చేస్తోందని స్పష్టం చేశారు. వయస్సు వ్యత్యాసం 3 ఏళ్లకు మించితే మాత్రం సాధారణ క్రిమినల్ చట్టాలే వర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు.

ఈ ప్రతిపాదనకు యువ హక్కుల కార్యకర్తలు, విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. అయితే ఈ ప్రతిపాదనపై నేపాల్‌లోని బాలల హక్కుల సంఘాలు, మహిళా పక్షపాతులు పెదవి విరుస్తున్నారు. బాల్య వివాహాలు, లింగ వివక్షత, లైంగిక హింసతో కొట్టుమిట్టాడుతున్న నేపాల్ లాంటి దేశంలో ఇలాంటి మినహా యింపులు ఇస్తే.. బాలికల రక్షణ కవచం బలహీన పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One