Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీవీకే విజయ్ ది ఎంజీఆర్, ఎన్టీఆర్ లను మించింన విజయం.. రజనీకాంత్

టీవీకే విజయ్ ది ఎంజీఆర్, ఎన్టీఆర్ లను మించింన విజయం.. రజనీకాంత్

టీవలి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించిన తమిళ స్టార్ హీరో , టీవీకే అధినేత విజయ్‌పై సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసల జల్లు కురిపించారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి అధికారంలోకి వచ్చిన విజయ్ విజయం చారిత్రాత్మకంగా అభివర్ణించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అద్భుతమైన విజయంతో అధికారాన్ని దక్కించుకున్న సంగతి విదితమే. అయితే ఆ విజయం తరువాత తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యవహరించిన తీరు పలు విమర్శలకు దారి తీసింది. ఎన్నికలలో పరాజయం పాలైన డీఎంకే అధినేత స్టాలిన్ నివాసానికి వెళ్లి మరీ పలకరించి, పరామర్శించిన రజనీకాంత్, ఘన విజయం సాధించిన టీవీకే విజయ్ కు అభినందించలేదు.

మరో పక్క.. కమల్ హసన్ స్వయంగా విజయ్ నివాసానికి వెళ్లి అభినందనలు తెలియజేశారు. కానీ రజనీకాంత్ మాత్రం విజయ్ కు మర్యాదపూర్వకంగా కలవకపోవడం, కనీసం అభినందనలు తెలియజేయకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. రజనీకాంత్ అసూయతో విజయ్‌ను అభినందించలేదన్న విమర్శలూ వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలు మరియు అసూయ వార్తలపై రజనీకాంత్ స్పందించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు, తమిళనాడులోని రెండు ప్రధాన ద్రావిడ పార్టీలను ఒంటరిగా ఎదుర్కొని విజయ్ ఈ ఘన విజయాన్ని సాధించారంటూ మీడియా ఎదుట విజయ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. గతంలో ఎన్టీఆర్, ఎంజీఆర్ సాధించిన విజయాల కంటే విజయ్ సాధించిన విజయం ఎంతో గొప్పదన్నారు. విజయ్ విజయం సాధించడం, ముఖ్యమంత్రి కావడం తనకు ఎంతో సంతోషం కలిగించిందన్నారు.

తనకు రాజకీయాలతో సంబంధం లేదనీ, రాజకీయాలకు దూరమై చాలా కాలమైందని చెప్పారు. ఇక విజయ్ పై తాను అసూయ చెందుతున్నానని వస్తున్న వ్యాఖ్యలను పూర్తిగా కొట్టిపారేసిన రజనీకాంత్, తమ ఇద్దరి మధ్యా పాతికేళ్లకు పైన వయస్సు తూడా ఉందని గుర్తు చేశారు. యువకుడైన విజయ్, రాజకీయాలకు అతీతంగా స్వయంకృషితో, సొంత బలంతో రెండు పెద్ద పార్టీలను ఎదిరించి ఈ గుర్తింపు తెచ్చుకున్నాడని ప్రశంసించారు. ఇక స్టాలిన్‌ను కలవడంపై వస్తున్న విమర్శలకు కూడా రజనీకాంత్ సమాధానం చెప్పారు.

స్టాలిన్ తో తన స్నేహం రాజకీయాలకు సంబంధించినది కాదన్నారు. కొలత్తూరులో స్టాలిన్ పరాజయం పాలు కావడం తనను ఎంతగానో బాధించిందని, అందుకే స్నేహపూర్వకంగా ఆయన్ను పరామర్శిం చానన్నారు. ముఖ్యమంత్రిగా విజయ్ విజయం సాధించిన వెంటనే తాను ఫోన్ ద్వారా అభినందనలు తెలియజేశానని, ఇందులో దాచడానికి ఏమీ లేదన్న రజనీకాంత్.. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలో తమిళనాడు ప్రగతి పథంలో పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One