Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Tollywood చిరంజీవి vs బాలకృష్ణ టాలీవుడ్ డబుల్ ధమాకా

Tollywood చిరంజీవి vs బాలకృష్ణ టాలీవుడ్ డబుల్ ధమాకా

తెలుగు సినీ ప్రియులకు ఈ మే 21 ఒక ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోనుంది. నందమూరి, మెగా అభిమానులకు ఒకే రోజు రెండు భారీ సర్ప్రైజ్‌లు ఇస్తూ టాలీవుడ్ డబుల్ ధమాకాకు తెరతీసింది.

టాలీవుడ్ లో ఇద్దరు అగ్ర కథానాయకులు అయిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), నటసింహం నందమూరి బాలకృష్ణ(Balakrishna)ల క్రేజీ చిత్రాలు ఒకే రోజు గ్రాండ్‌గా లాంచ్ కానుండటం విశేషం. సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమా ఓపెనింగ్ ఉంటేనే ఇండస్ట్రీ మొత్తం సందడిగా మారుతుంది, అలాంటిది ఒకే రోజు ఇద్దరు లెజెండరీ హీరోల చిత్రాలు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుండటంతో టాలీవుడ్ సర్కిల్స్‌లో ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోంది. 'చిరు-బాబీ 2'గా ప్రచారంలో ఉన్న మెగాస్టార్ 158వ ప్రతిష్టాత్మక చిత్ర ముహూర్తపు పూజా కార్యక్రమాలు మే 21న ఉదయం ఘనంగా జరగనున్నాయి.

బాబీ ఈసారి చిరంజీవిని మునుపెన్నడూ చూడని సరికొత్త రగ్గడ్ మాస్ లుక్‌లో ప్రెజెంట్ చేయబోతున్నారని సమాచారం. (Mega 158) మరోవైపు, టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించబోయే మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ 'ఎన్‌బీకే-కొరటాల శివ' కూడా అదే రోజు మే 21న అధికారికంగా ప్రారంభం కానుంది. బాలకృష్ణ మార్క్ పవర్‌ఫుల్ మాస్ ఎలిమెంట్స్‌కు, కొరటాల శివ స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ తో కూడిన కథ తోడైతే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. (NBK 112) ఒకే రోజు ఇద్దరు సీనియర్ స్టార్ హీరోల సినిమాలు లాంచ్ అవుతుండటంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పండగ వాతావరణం నెలకొంది. టాలీవుడ్‌లో ఈ రెండు చిత్రాలు అత్యంత భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కబోతున్నాయి. మే 21న జరిగే ఈ జంట చిత్రాల ప్రారంభోత్సవ వేడుకల కోసం ఇండస్ట్రీ వర్గాలతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One