Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Tollywood Trending పెద్దికి సెన్సార్ షాక్ కంగనా రనౌత్ సీక్రెట్ మ్యారేజ్

Tollywood Trending పెద్దికి సెన్సార్ షాక్ కంగనా రనౌత్ సీక్రెట్ మ్యారేజ్

1. 'పెద్ది'కి షాకిచ్చిన సెన్సార్ బోర్డు 'పెద్ది' సినిమాలోని 'చికిరి' పాట సూపర్ డూపర్ హిట్టయ్యింది. అయితే అందులో 'సరుకు - సామాను' పదంపై కొంత అభ్యంతరం వ్యక్తమైంది.

సెన్సార్ బోర్డు కూడా పాటలో ఈ పదానికి కత్తెర వేసింది. ఆ స్థానంలో కొత్త మాట వినిపించబోతోంది. 'U/A' సర్టిఫికెట్ తో.. 3 గంటల 9 నిమిషాల డ్యూరేషన్ తో..

జూన్ 4న ఈ సినిమా విడుదల కాబోతోంది. 2. ఆగిపోయిన బాలయ్య క్రేజీ ప్రాజెక్ట్! నందమూరి బాలకృష్ణ, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించాలనుకున్న భారీ ప్రాజెక్ట్ అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది.

దీంతో దర్శకుడు వివేక్ ఆత్రేయ.. మాస్ మహారాజా రవితేజకు ఒక సరికొత్త కథను వినిపించి గ్రీన్ సిగ్నల్ అందుకున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. 3. 'సలార్‌ 2'పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్!

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన 'సలార్' ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, దీనికి సీక్వెల్ గా రావాల్సిన 'సలార్‌ 2' ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందంటూ సోషల్ మీడియాలో పుకార్లు పుట్టుకొచ్చాయి. వీటికి చెక్ పెడుతూ తాజాగా ప్రశాంత్ నీల్ 'సలార్ 2' పై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను ఎన్టీఆర్‌తో చేస్తున్న 'డ్రాగన్' పూర్తయిన తర్వాత, 'సలార్ 2' షూటింగ్ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు.

4. ఫేక్ బికినీ ఫోటోలపై రుక్మిణి వసంత్ ఫైర్! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తన బికినీ ఫోటోలపై హీరోయిన్ రుక్మిణి వసంత్ స్పందించారు. ఆ బోల్డ్ విజువల్స్ ఫేక్ అని, AIను ఉపయోగించి కొందరు ఆకతాయిలు ఈ మార్ఫింగ్ కు పాల్పడ్డారని ఆమె మండిపడ్డారు.

ఏఐ డీప్‌ఫేక్ చేసిన వారిని, వాటిని ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ చేస్తున్న వారిని కఠినంగా శిక్షించేందుకు ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెటిజన్లు ఎవరూ ఇలాంటి ఫేక్ ఫోటోలను షేర్ చేయవద్దని రుక్మిణి వసంత్ విజ్ఞప్తి చేశారు. 5. అక్కినేని అఖిల్ 'లెనిన్' టీజర్ రివ్యూ అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'లెనిన్' టీజర్ విడుదలైంది.

మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ లో.. అఖిల్ సరికొత్త మాస్ మేకోవర్‌, చిత్తూరు యాసలో అఖిల్ పలికిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో సాగే క్యూట్ లవ్ ట్రాక్, సరదా సంభాషణలు టీజర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. చివర్లో వచ్చే ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ సినిమా రేంజ్‌ను పెంచేశాయి.

ఈ సినిమా జూన్ 26న థియేటర్లలోకి రానుంది. 6. 'బాహుబలి' బాటలో 'స్వయంభు' టాలీవుడ్ లో 'బాహుబలి', 'ఆర్‌ఆర్‌ఆర్' వంటి విజువల్ వండర్స్ తర్వాత అత్యధిక గ్రాఫిక్స్ వర్క్ జరుపుకుంటున్న చిత్రాల జాబితాలో ఇప్పుడు 'స్వయంభు' చేరిపోయింది. ఈ సినిమాలో ఏకంగా 2,700కు పైగా VFX షాట్స్ ఉండబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

దాదాపు 750 మంది CG ఆర్టిస్టులు ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. ఒక మిడ్-రేంజ్ హీరో సినిమాకు ఈ స్థాయిలో గ్రాఫిక్స్ పనులు జరగడం హాట్ టాపిక్ గా మారింది. 7. 'రౌడీ జనార్దన' కోసం ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్!

విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలా కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న 'రౌడీ జనార్దన' మూవీ నుండి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాకు ఇద్దరు సంగీత దర్శకులు వర్క్ చేయబోతున్నారు. 'యానిమల్', 'టాక్సిక్' చిత్రాల ఫేమ్ విశాల్ మిశ్రా ఈ సినిమాలోని పాటలకు స్వరకల్పన చేస్తుండగా.. 'భ్రమయుగం' ఫేమ్ క్రిస్టో జేవియర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాధ్యతలను తీసుకోనున్నారు.

8. 200 కోట్ల క్లబ్‌లో 'కరుప్పు'! కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా డైరెక్టర్ ఆర్జే బాలాజీ తెరకెక్కించిన 'కరుప్పు' మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఈ చిత్రం కేవలం ఎనిమిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.

200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో సూర్య సినీ కెరీర్‌లోనే రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి చిత్రంగా 'కరుప్పు' నిలిచింది. ప్రస్తుత కలెక్షన్ల జోరు చూస్తుంటే..

ఈ సినిమా లాంగ్ రన్‌లో రూ. 300 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 9. 'జన నాయగన్‌'కు ఇంకా రాని సెన్సార్ క్లియరెన్స్..

! దళపతి విజయ్ నటించిన 'జన నాయగన్‌' సినిమా విడుదలపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సెన్సార్ బోర్డుతో తలెత్తిన వివాదాల కారణంగా ఈ సినిమా గత ఐదు నెలలుగా ల్యాబ్‌కే పరిమితమైంది. దీనిపై తాజాగా స్పందించిన నిర్మాత వెంకట్ కె. నారాయణ..

ఇప్పటికీ సెన్సార్ బోర్డు నుండి సర్టిఫికేట్ రాలేదని స్పష్టం చేశారు. సినిమాను త్వరగా విడుదల చేయడానికి తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. 10. సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్న కంగనా రనౌత్?

బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్, ఎంపీ కంగనా రనౌత్ తన పెళ్లి రూమర్లపై స్పందించారు. ఇటీవల ఆమె మెడలో నల్లపూసల గొలుసు, చేతులకు మట్టిగాజులతో సాంప్రదాయబద్ధంగా కారు ఎక్కుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో.. ఆమె రహస్యంగా పెళ్లి చేసుకుందంటూ వార్తలొచ్చాయి. అయితే, ఆ ప్రచారంలో వాస్తవం లేదని, అది కేవలం సినిమా షూటింగ్ గెటప్ మాత్రమేనని కంగనా క్లారిటీ ఇచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One