Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Toxic టాక్సిక్ ఆలస్యం వెనుక అసలు రహస్యం యష్ సంచలన వ్యాఖ్యలు

Toxic టాక్సిక్ ఆలస్యం వెనుక అసలు రహస్యం యష్ సంచలన వ్యాఖ్యలు

ష్(Yash)టాక్సిక్(Toxic)వాయిదా ఎందుకు పడుతుందో తెలియని పరిస్థితి. ఈ విషయంలో ఎవరి ఆలోచనలకి తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. యష్ తో పాటు చిత్ర యూనిట్ ఎవరు కూడా ఆలస్యంపై స్పందించడం లేదు.

ఈ విషయంలో ఫ్యాన్స్ బెంగ పెట్టుకున్నారు. అలాంటిది యష్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆలస్యానికి గల కారణాలని వెల్లడి చేసాడు. యష్ మాట్లాడుతు ఒక సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ప్రమోషన్స్, మార్కెటింగ్, బిజినెస్ డీల్స్ జోరుగా సాగుతుంటాయి. కానీ 'టాక్సిక్' విషయంలో హాలీవుడ్ పంపిణీ విధానాన్ని ఫాలో అవుతున్నాం.

పాశ్చాత్య దేశాలలో సినిమా షూటింగ్, పోస్ట్-ప్రొడక్షన్ పనులన్నీ వంద శాతం పూర్తయిన తర్వాతే అసలైన మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను మొదలుపెడతారు. భారీ బడ్జెట్‌తో కూడిన టాక్సిక్ లాంటి అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లలో పెట్టుబడులు పెట్టే విదేశీ పంపిణీదారులు ముందుగా పూర్తి అయిన అవుట్‌పుట్‌ను చూడాలని కోరుకుంటారు. అందువల్ల, సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయాలనే గ్లోబల్ మార్కెట్ వ్యూహంతోనే లేట్ అవుతుంది. Also read: Vijay: సిఎం విజయ్ నిర్ణయంపై విశాల్ తీవ్ర అసంతృప్తి..

సంచలన ట్వీట్ ఈ విషయంలో భారతీయ ప్రేక్షకులు, ముఖ్యంగా తన ప్రాణసమానమైన అభిమానులు తీవ్రంగా కలత చెందుతారని తెలుసు. అయితే, ఇదంతా టాక్సిక్ ని అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో ప్రెజెంట్ చేయడం కోసమే. ఇటీవల అమెరికాలోని లాస్ వెగాస్‌లో జరిగిన ప్రసిద్ధ 'సినిమాకాన్' (CinemaCon) ఈవెంట్‌లో 'టాక్సిక్' చిత్రానికి లభించిన అద్భుతమైన గ్లోబల్ రెస్పాన్స్ చూసిన తర్వాత, ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా సరైన వేదికను కల్పించాలనే నమ్మకం మరింత బలపడిందని యశ్ పేర్కొన్నారు. గీతూ మోహన్ దాస్‌ దర్శకత్వంలో జనగణమన, మెగా 158 ఫేమ్ ప్రొడ్యూసర్ వెంకట్ కే నారాయణ అత్యంత భారీ వ్యయంతో నిర్మించాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One