Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉన్నంతలో మనకున్నంతలో అందరి కళ్ళు తెరిపించేలా 'రియాలిటీ' సాంగ్

ఉన్నంతలో మనకున్నంతలో అందరి కళ్ళు తెరిపించేలా 'రియాలిటీ' సాంగ్

కిరణ్‌ అబ్బవరం స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న సినిమా 'రియాలిటీ' (Reality). ఈ సినిమా నుంచి తాజాగా 'భజగోవిందం.. బ్రతుకే కోలాహలం..' అంటూ సాగే పాటను విడుదల చేశారు.

జీవితంలో మనకున్న దానితో సంతృప్తిగా బతకడం, ఎవరికీ తలవంచకుండా స్వశక్తితో ఎదగడం ఎంత ముఖ్యమో ఈ పాటలో చక్కగా చెప్పారు. 'ఉన్నంతలో మనకున్నంతలో బతికితే అదే సుఖము.. ఎవరికి తలొంచక నువ్వు నీ కాళ్లపై నిలబడే గుణం వరము..' అంటూ సాగే పంక్తులు ఆలోచింపజేస్తున్నాయి.

జీవితంలో సంతోషం అంటే ఇతరులతో పోల్చుకోవడం కాదని, మనకున్నదానితో హాయిగా జీవిస్తూ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడమే నిజమైన సుఖమని ఈ పాట సందేశం ఇస్తోంది. ఈ గీతానికి సనారే సాహిత్యం అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చారు. కేరళకు చెందిన ప్రముఖ గాయని వైకోం విజయలక్ష్మి తన ప్రత్యేకమైన స్వరంతో పాటను ఆలపించారు. సందేశాత్మక భావాలకు భీమ్స్‌ అందించిన సంగీతం తోడవడంతో పాట వినసొంపుగా సాగుతోంది.

'రియాలిటీ' సినిమాలో దేవికా భట్‌, శరత్‌ కుమార్‌, సాయికుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హీరోగా నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలను కూడా కిరణ్‌ అబ్బవరం చేపట్టడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇది కూడా చదవండి: ఆరు ముఖాల బొమ్మ కనిపించగానే.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న త్రివిక్రమ్ కామెంట్స్.! [Bhaja Govindam Song, Unnanthalo Manakunnanthalo Song, Reality Movie, Kiran Abbavaram, Bheems Ceciroleo, Vaikom Vijayalakshmi, Sanare Lyrics, Telugu Songs 2026]

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One