Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉప్పల్‌లో ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందా.. నలుగురు అరెస్ట్

ఉప్పల్‌లో ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందా.. నలుగురు అరెస్ట్

ప్పల్ స్టేడియంలో ఈరోజు జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో టికెట్ల కోసం అభిమానులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత కొన్ని రోజులుగా టికెట్లు దొరకక చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ ఇబ్బందులు పడుతుండగా..

ఇదే పరిస్థి తిని ఆసరాగా చేసుకుని కొందరు బ్లాక్ మార్కెట్ దందాకు తెరలేపారు. ముఖ్యంగా కాంప్లిమెంటరీ టికెట్లను పక్కదారి పట్టించి భారీ ధరలకు విక్రయిస్తూ లక్షలు దండిగా సంపాదిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్టేడియం పరిసర ప్రాంతాల్లో అభిమా నుల బలహీనతను క్యాష్ చేసుకుంటూ బ్లాక్ టికెట్ల వ్యాపారం జోరుగా కొనసా గుతున్నట్లుగా సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అట్టి ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉప్పల్ స్టేడియం దగ్గర అధిక ధర లకు ఐపీఎల్ కాంప్లిమెంటరీ టికెట్లు విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అదు పులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుంచి పలుచోట్లకు చెందిన టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. టికెట్లు ఎవరి నుంచి వచ్చాయి..? ఇంకా ఈ దందాలో మరెవరెవరు ఉన్నారు..? అనే కోణాల్లో పోలీసులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One