Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Vadde Naveen సినిమాలు అందుకే ఆపేశాను వడ్డే నవీన్ ఎమోషనల్ స్పీచ్!

Vadde Naveen సినిమాలు అందుకే ఆపేశాను వడ్డే నవీన్ ఎమోషనల్ స్పీచ్!

టాలీవుడ్ సీనియర్ హీరో వడ్డే నవీన్ (Vadde Naveen) సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ వెండితెరపైకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఆయన నటిస్తూ, నిర్మిస్తున్న లేటెస్ట్ క్రేజీ మూవీ 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' (Transfer Trimurthulu).

ఈ సినిమాకు సంబంధించిన గ్రాండ్ టీజర్ లాంచ్ ఈవెంట్ రీసెంట్‌గా హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో వడ్డే నవీన్ పాల్గొని మాట్లాడారు. చాలా కాలం తర్వాత మైక్ పట్టుకున్న ఆయన.. తన కెరీర్ గురించి, వ్యక్తిగత జీవితం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఈ ఈవెంట్‌లో వడ్డే నవీన్ మాట్లాడుతూ మొదటగా ఒక ఎమోషనల్ విషయాన్ని పంచుకున్నారు. తన తండ్రి చనిపోయిన తర్వాత తను నటిస్తూ, నిర్మిస్తున్న మొదటి సినిమా ఇదని ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా సభలో ఉన్నవారందరితో కలిసి తన తండ్రికి నివాళులర్పించారు. ఆ తర్వాత మీడియాలో, సోషల్ మీడియాలో నిరంతరం వినిపించే ఒక ప్రశ్నపై ఆయన స్పష్టతనిచ్చారు.

"చాలా మంది ఫ్యాన్స్, మీడియా మిత్రులు అడుగుతుంటారు.. అస్సలు వడ్డే నవీన్ ఎక్కడ ఉన్నాడు? టాలీవుడ్‌లో ఉన్నాడా లేదా అని సందేహపడుతుంటారు. నేను ఎక్కడికీ వెళ్ళలేదు, ఎప్పుడూ హైదరాబాద్‌లోనే ఉన్నాను.

అయితే ఎక్కువగా ప్రెస్ ముందుకు, మీడియా ముందుకు రాకపోవడంతో ఆ అనుమానాలు వచ్చాయి. ఈ గ్యాప్‌లో నేను నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి నా పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేశాను. నేను స్క్రీన్ మీద కనిపించకపోయినా తెలుగు ఆడియన్స్ నన్ను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటూనే ఉన్నారు. అందుకు అందరికీ పేరుపేరునా థాంక్స్" అని నవీన్ అన్నారు.

సినిమాలకు ఇంత పెద్ద గ్యాప్ రావడంపై స్పందిస్తూ.. "నిజానికి నేను సినిమాలు చేయకూడదు అనుకున్నాను. నాకు నచ్చిన మంచి కథలు రాలేదు, వచ్చిన కథలను నేను చేయలేదు. అందుకే ఈ బ్రేక్ వచ్చింది.

ఈ మూడేళ్లలో ఎన్నో స్క్రిప్ట్స్ విన్నాను. ఆ సమయంలోనే డైరెక్టర్ కమల్ వచ్చి నాకు 'త్రిమూర్తులు' క్యారెక్టర్, 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' అనే టైటిల్ చెప్పాడు. ఆ పాయింట్ నచ్చి ఒక ఏడాది పాటు కూర్చుని కథను పూర్తిగా డెవలప్ చేశాం. కథ పూర్తిగా నమ్మకం కలిగించాకే ప్రొడక్షన్ స్టార్ట్ చేశాం.

ఈ సినిమా కంటెంట్ పరంగా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది" అని నవీన్ భరోసా ఇచ్చారు. చాలా మంది దీనిని తన సెకండ్ ఇన్నింగ్స్ లేదా కంబ్యాక్ మూవీ అంటున్నారని, కానీ తాను మాత్రం దీనిని కంబ్యాక్ లా భావించడం లేదని నవీన్ స్పష్టం చేశారు. కెరీర్ మొదట్లో తన మొదటి సినిమాకు ఎలాంటి డెడికేషన్, ప్యాషన్‌తో అయితే పనిచేశానో, ఈ సినిమాకు కూడా అదే కసిగా పనిచేశానని, అందుకే ఇది తనకు మరో మొదటి సినిమా లాంటిదేనని నవీన్ అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One