బుల్లితెర మీద కామెడీ షోస్ లో ఏది టాప్ ఏది ఆడియన్స్ కి ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. సాయంత్రం అయ్యేసరికి ఫ్యామిలీస్ ని ఏది ఎంటర్టైన్ చేస్తుంది అని ఎవరైనా అడిగితే ఎవ్వరైనా ఎం చెప్పేవాళ్ళంటే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ అనేవాళ్ళు మొన్నటి వరకు.
ఇక ఇప్పుడు జెమినిలో మాస్ జాతర కామెడీ షో స్టార్ట్ అయ్యింది. అది ఇప్పుడు టాప్ రేటింగ్ లో నిలబడింది. ఇక ఇందులో అందరూ తెలిసిన వాళ్ళే ఉన్నారు. జడ్జెస్ గా జానీ మాష్టర్, నవదీప్, బిందు మాధవి ఉన్నారు.
ఇక బిందు మాధవి ఈ షో గురించి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పారు. "మాస్ జాతర ఫుల్ ఎంటర్టైన్మెంట్ షో. వీళ్ళు నన్ను అప్రోచ్ ఐనప్పుడు వద్దు అనుకున్నా. ఎందుకంటే కామెడీ షో అంటేనే వల్గర్ జోక్స్ తీసుకొచ్చి అవన్నీ చేస్తుంటారు కదా.
సో ఇప్పుడు ఇది ఎందుకులే అని వద్దు అనుకున్నా . మళ్ళీ డైరెక్టర్ వచ్చి నాకు నమ్మకం కలిగించారు. వల్గర్ లైన్స్ తీసుకురాము. ఫామిలీ మొత్తం కలిసి కూర్చుని చూసేలా ఉంటుంది షో.
అలంటి వల్గర్ లైన్స్ ఉంటే మీరు వాకౌట్ చేయండి అన్నారు. ఆయన చెప్పాక వచ్చాను. 28 ఎపిసోడ్స్ ఐపోయాయి. నిజంగా హ్యాపీగా ఉంది.
తెలుగులో వల్గర్ లేకుండా కామెడీ స్కిట్స్ జరుగుతున్నాయి. నవదీప్ నాకు మంచి ఫ్రెండ్. 10 ఇయర్స్ నుంచి తెలుసు. మంచి బడ్డీ కూడా.
చాల ఫన్నీ గా ఉంటాడు. అతనితో వర్క్ చేయడం బాగుంటుంది. బెస్ట్ కో-స్టార్ నాకు. మళ్ళీ ఇప్పుడు నాకు కో-జడ్జ్ గా ఉండడం నాకు చాలా హ్యాపీ. జానీ మాష్టర్ తో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్న. ఒకదానిలో ఉండకుండా మల్టిపుల్ జాబ్స్ చేయడం నాకు చాలా ఇష్టం." అని చెప్పారు బిందు మాధవి.

