-సినిమా పేరు: వీరభద్రుడు -నటీనటులు: సూర్య, త్రిష, ఆర్ జె బాలాజీ, ఇంద్రాన్స్, అనగ మాయారవి, నట్టి నటరాజ్, శ్వాసిక -విజయ్, మన్సూర్ అలీ ఖాన్, తదితరులు -సినిమాటోగ్రఫీ: జికె విష్ణు -ఎడిటింగ్: కలై వనన్ -మ్యూజిక్: సాయి అభ్యంకర్ -నిర్మాతలు: ఎస్ ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు -బ్యానర్: డ్రీం వారియర్ పిక్చర్స్ -రచన,దర్శకత్వం: ఆర్ జె బాలాజీ -రిలీజ్ డేట్ : మే 15 2026 వరుస ప్లాప్స్ తో సతమవుతున్న స్టార్ హీరో సూర్య ఈ రోజు వీరభద్రుడుగా అడుగుపెట్టాడు.
ప్రచార చిత్రాలు బాగుండటంతో వీరభద్రుడుపై అభిమానుల్లోను, ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ బేబీ కృష్ణ( ఆర్ జె బాలాజీ) యంగ్ లాయర్. డబ్బు కోసం ఎంతటి తప్పుడు కేసులనైనా ఒప్పుకొని గెలుస్తుంటాడు.
దీంతో ఎంతో మంది అమాయకుల జీవితాలు నాశనం అవుతుంటాయి. బేబీ కృష్ణకి ఆపోజిట్ గా కేసు తీసుకునే సాహసం ఎవరు చెయ్యలేరు. కోర్టు,జడ్జిని సైతం తన అధీనంలో ఉంచుకుని అసాంఘిక శక్తిగా మారాడతాడు. కోర్ట్ ఆవరణలో పరమేశ్వరుడి మరో రూపమైన 'వీరభద్రుడు' కొలువుతీరి ఉంటాడు.
సూర్య(సూర్య) అదే కోర్టుకి లాయర్ గా వచ్చి మంచి వైపు నిలబడతాడు. ఈ విషయంలో సూర్యకి మరో లాయర్ ప్రీతీ( త్రిష) అండగా ఉంటుంది. సూర్యగా వచ్చింది వీరభద్రుడు అనే నిజం బేబీకృష్ణకి తెలుసు. కానీ తన అన్యాయాన్ని మాత్రం ఆపడు.
ఇంకా రెచ్చిపోతుంటాడు. వచ్చింది దేవుడు అని తెలిసినా బేబీ కృష్ణ రెచ్చిపోవడానికి కారణం ఏంటి? బేబీ కృష్ణ విషయంలో సూర్య అలియాస్ వీరభద్రుడు ఏం చేసాడు? న్యాయవ్యవస్థ వలన అన్యాయం జరుగుతున్న వాళ్ళని ఎలా కాపాడాడు?
అసలు వీరభద్రుడు ఎందుకు వచ్చాడు? ఆయన లక్ష్యం ఏంటనేదే వీరభద్రుడు ఎనాలసిస్ దేవుడే సాక్షాత్తు మనుషులతో కలిసి సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతున్నాడనే పాయింట్ తో ప్రస్తుత ఏఐ సొసైటీలో తెరకెక్కించాలంటే ఎంతో దమ్ము కావాలి. ఈ విషయంలో ఎక్కడ కూడా కృత్రిమం అనిపించకుండా బాగానే తెరకెక్కించారు. కావాలని ఒక మనిషికి అన్యాయం చేస్తే వంశాలే లేచిపోతాయనే అనే పాయింట్ అయితే జనాలకి రీచ్ అవుతుంది.
ఈ విషయంలో టన్నుల కొద్దీ భయం కూడా ఏర్పడటం పక్కా. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ప్రారంభంలో వచ్చే సీన్ తో వీరభద్రుడుపై క్యూరియాసిటీ ఏర్పడుతుంది. ఆ తర్వాత మీను అనే అమ్మాయి, తండ్రి మధ్య నడిచిన సీన్స్ అయితే కన్నీళ్లు తెప్పిస్తాయి. బేబీ కృష్ణ ఆ ఇద్దర్ని ఉపయోగించుకునే విధానం తన పంతం నెగ్గించుకోవడానికి ఇన్ స్పెక్టర్ ని బెదిరించే సీన్స్ సూపర్.
ఆ తర్వాత సూర్య ఎంట్రీ ఇవ్వడం, వీరభద్రుడుగా బేబీ కృష్ణకి పరిచయం అయ్యే సీన్స్ సూపర్. కాకపోతే ఆ తర్వాత వీరభద్రుడుతో బేబీ కృష్ణ నువ్వు దేవుడిలా కాకుండా మనిషిలా అవినీతి, మూర్కత్వం, అక్రమంతో నిండిన ఈ సమాజాన్ని ఎదుర్కోవాలి అని చెప్పే పాయింట్ బాగుంది. దీంతో సూర్యగానే వీరభద్రుడు పోరాటం చేస్తాడని అనుకుంటాం. కానీ ఆ దిశగా కథనం ఎక్కువగా నడవదు.
ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ లో సింగిల్ పాయింట్ పైనే నడిచిన కథనం సెకండ్ హాఫ్ లో తన పరిధిని పెంచుకుంది. తప్పు చేస్తే పతనం తప్పదు అనే భయాన్ని వీరభద్రుడు పుట్టించాడు. ఈ సందర్భంగా వచ్చిన సీన్స్ బాగున్నాయి.
అయినా వీరభద్రుడుకి బేబీ కృష్ణ యాంటీ గా వెళ్తుంటాడు. ఈ విషయంలోనే బేబీ కృష్ణని పురాణాల్లో ఉన్న ఒక రాక్షస జాతి అంశకి చెందిన వాడు అని, అందుకే దేవుడు అని తెలిసినా పోరాడుతున్నాడనే పాయింట్ ని జోడిస్తే బాగుండేది. లాజిక్ లేని కొన్ని అంశాలు కథలో ఉన్నాయి. క్లైమాక్స్ బాగుంది.
మీను, ముత్తు నాయుడు క్యారెక్టర్స్ ని ఎండింగ్ లో మళ్ళీ చూపించిన విధానం బాగుంది నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు వీరభద్రుడు, సూర్య క్యారెక్టర్స్ లో సూర్య పెర్ ఫార్మెన్స్ సూపర్.. తన కెరీర్ లోనే బెస్ట్ పెర్ ఫార్మెన్స్ చూపించిన మూవీ వీరభద్రుడు అని చెప్పవచ్చు. అన్ని వేరియేషన్స్ లోను తన హవా చాటాడు. త్రిష క్యారక్టర్ కి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు.
పైగా తన ముఖంలో గ్లామర్ తగ్గిపోయిందని ఈజీగా తెలుస్తుంది.బేబీ కృష్ణగా ఆర్ జె బాలాజీ యాక్టింగ్ సూపర్. తను తప్ప మరొకరిని ఆ క్యారక్టర్ లో ఉహించుకోలేం అనే విధంగా చేసాడు. దర్శకుడిగాను సక్సెస్ అయ్యాడు. కథకుడుగా మాత్రం సో సో.
'మీను'గా చేసిన అనగ మాయారవి, తండ్రి ముత్తు నాయుడుగా చేసిన ఇంద్రాన్స్ పెర్ఫార్మ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తమ అద్భుతమైన పెర్ఫార్మ్ తో వీరభద్రుడుకి ప్రధాన వెన్నెముకగా నిలిచారు. జడ్జిగా చేసిన నట్టి నటరాజ్ తో పాటు మిగతా వాళ్ళు కూడా తమ క్యారక్టర్ కి న్యాయం చేసారు. సాయి అభ్యంకర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, జికె విష్ణు కెమెరా పనితనం, కలై వనన్ ఎడిటింగ్ ప్లస్ పాయింట్.
నిర్మాణ విలువలు సూపర్ గా ఉన్నాయి. బలాలు 1 .సూర్య, ఆర్ జె బాలాజీ పెర్ ఫార్మెన్స్ 2 .వీరభద్రుడు ఎపిసోడ్స్ 3 . కోర్ట్ సీన్స్ 4 . మీను, ముత్తు నాయుడు క్యారక్టర్ డిజైన్ 5 .డైరెక్షన్ 6 . క్లైమాక్స్ ఎపిసోడ్ బలహీనతలు 1 .కథనంలోని కొన్ని లోపాలు 2 లాజిక్ లేని కొన్ని సీన్స్ చివరిగా చెప్పాలంటే వీరభద్రుడు పర్వాలేదనే స్థాయిలోనే మెప్పించాడు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుంది రేటింగ్ 2 .5 /5 అరుణాచలం

