Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విదేశీ స్టంట్ మాస్టర్ల పర్యవేక్షణలో డ్రాగన్ ఇంటర్నేషనల్ రేంజ్ యాక్షన్ లోడింగ్!

విదేశీ స్టంట్ మాస్టర్ల పర్యవేక్షణలో డ్రాగన్ ఇంటర్నేషనల్ రేంజ్ యాక్షన్ లోడింగ్!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

'దేవర'తో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటిన తారక్, ఇప్పుడు నీల్ మార్క్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకులను ఊపేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి 'డ్రాగన్' అనే పవర్ ఫుల్ టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు స్కై హై రేంజ్‌కు చేరుకున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా తదుపరి షెడ్యూల్ హైదరాబాద్‌లో అత్యంత భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. ఈ క్రేజీ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఏకంగా విదేశాల నుంచి ప్రత్యేకంగా స్టంట్ ఫైటర్లను రప్పిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రశాంత్ నీల్ సినిమాల్లో యాక్షన్ అంటే ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'కేజీఎఫ్', 'సలార్' సినిమాలను మించి ఈ చిత్రంలో రా అండ్ రగ్గడ్ యాక్షన్ సీక్వెన్స్‌లను డిజైన్ చేస్తున్నారట. హైదరాబాద్‌లో జరగబోయే ఈ కీలక షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌తో పాటు సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, మలయాళ స్టార్ బిజు మీనన్ కూడా పాల్గొనబోతున్నారు. వీరి మధ్య వచ్చే యాక్షన్ బ్లాక్స్ సినిమాకే హైలెట్‌గా నిలవనున్నాయని సమాచారం.

ఎన్టీఆర్ తన కెరీర్‌లోనే మునుపెన్నడూ చూడని సరికొత్త స్టైలిష్ అండ్ స్లిమ్ లుక్‌లో ఈ సినిమాలో కనిపించబోతుండటం విశేషం. ఇప్పటికే విడుదలైన కొన్ని లీక్డ్ మేకోవర్ స్టిల్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. రవి బస్రూర్ తనదైన ఊపునిచ్చే సంగీతాన్ని అందిస్తున్నారు.

భారీ నిర్మాణ విలువలతో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్, ప్రశాంత్ నీల్ టేకింగ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ టైటిల్ మరియు టీజర్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి 'డ్రాగన్' తో తారక్ మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One