Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయ్ విజయం క్రెడిట్  ఖాతాలో వేసుకోవడానికి వైసీపీ ఆరాటం!

విజయ్ విజయం క్రెడిట్ ఖాతాలో వేసుకోవడానికి వైసీపీ ఆరాటం!

మిళనాడు రాజకీయాలను దశాబ్దాలుగా ఆ రాష్ట్రాన్ని శాసిస్తున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి టీవీకే అధినేత, దళపతి, విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) గండి కొట్టింది.

రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయపరిచే అద్భుత విజయాన్ని అందుకుంది. తొలి ప్రయత్నంలోనే అగ్ర శ్రేణి పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి పార్టీలను వెనక్కి నెట్టి విజయ్ ప్రభంజనం సృష్టించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే.. సందట్లో సడేమియా అన్నట్లు విజయ విజయంలో తమకు కూడా భాగం ఉందంటూ వైసీపీ ఆ క్రెడిట్ ను చోరీ చేయడానికి (తమ ఖాతాలో వేసుకోవడానికి) ఆరాటపడుతోంది.

తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.

నిజానికి వైసీపీకి, తమిళనాడు రాజకీయాలకు మధ్య సంబంధం ఇప్పుడొక విచిత్రమైన మలుపు తిరిగింది. గతంలో వైసీపీ నాయకత్వం ప్రస్తుత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌తో అత్యంత సన్నిహిత సంబంధాలను కొనసాగించింది. గత ఎన్నికల సమయంలో వైసీపీ సీనియర్ నేత..

మాజీ మంత్రి రోజా స్వయంగా తమిళనాడుకు వెళ్లి డీఎంకే తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. స్టాలిన్ పాలన జగన్ పాలన లాగే అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపించారు రోజా. డీఎంకే మళ్లీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమని నాడు ఆమె ధీమా వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుత ఫలితాలతో సీన్ రివర్స్ అయిందని గ్రహించిన వైసీపీ..

వెంటనే ప్లేటు ఫిరాయించింది. నిన్నటి వరకు స్టాలిన్ జపం చేసిన వైసీపీ శ్రేణులు ఇప్పుడు అకస్మాత్తుగా విజయ్ భజన మొదలెట్టేశాయి. ఈ క్రెడిట్ పాలిటిక్స్ పై నెటిజనులు వైసీపీని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఏపీలో సొంత ప్రాబల్యాన్ని కోల్పోయి, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని స్థితిలో ఉన్న వైసీపీ..

పొరుగు రాష్ట్రంలో ఒక కొత్త పార్టీ సాధించిన విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని చూడటం హాస్యాస్పదంగా ఉందంటూ ఎద్దేవా చేస్తున్నారు. విజయ్ తన వ్యక్తిగత కరిష్మా, సుదీర్ఘ కాలంగా చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఈ స్థాయికి చేరుకున్నారని పేర్కొంటూ.. విజయం విజయంలో వైసీపీకి ఆవగింజలో పావువంతు కూడా సంబంధం లేదని ఏకిపారేస్తున్నారు. మరోవైపు, విజయ్ అభిమానులు కూడా ఈ పరిణామాలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని అత్యంత స్వతంత్రంగా, ఎవరి అండ లేకుండా ప్రారంభించారని.. ఈ విజయం పూర్తిగా ఆయన కష్టార్జితమనీ, ఈ విజయం క్రెడిట్ లో ఎవరికీ భాగం లేదనీ విస్పష్టంగా చెబుతున్నారు. ఏది ఏమైనా, పొరుగు రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో కూడా తమ ఉనికిని చాటుకోవాలని వైసీపీ పడుతున్న తాపత్రేయం నవ్వులపాలౌతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One