Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయ్‌ని చూసి నేనెందుకు అసూయ పడతాను సూపర్‌స్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌!

విజయ్‌ని చూసి నేనెందుకు అసూయ పడతాను సూపర్‌స్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌!

మిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ దళపతి విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన సంగతి తెలిసిందే. ఆయన నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కజగం' (TVK) అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది.

అయితే, ఈ చారిత్రాత్మక విజయంపై తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎయిర్‌పోర్టులో మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా రజినీ వెళ్ళిపోవడంతో, విజయ్ విజయం ఆయనకు ఇష్టం లేదంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెడుతూ సూపర్ స్టార్ మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారు. విజయ్ సాధించిన ఈ అద్భుతమైన గెలుపు తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు.

రాజకీయాల్లో విజయ్ సాధించిన ఘనతను రజినీకాంత్ ఆకాశానికెత్తారు. గతంలో దిగ్గజాలు ఎమ్‌జీఆర్, నందమూరి తారకరామారావు సాధించిన విజయాల కంటే ఇది చాలా పెద్దదని కొనియాడారు. అప్పటి పరిస్థితులతో పోలిస్తే, ప్రస్తుత కాలంలో విజయ్ ఒంటరిగా పోరాడి, కేంద్రంలోని అధికార బలంతో ఉన్న బీజేపీని, దశాబ్దాల చరిత్ర కలిగిన డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి బలమైన ద్రావిడ పార్టీలను ఢీకొట్టి గెలవడం సామాన్యమైన విషయం కాదని విశ్లేషించారు. ఈ సందర్భంగా తనపై వస్తున్న అసూయ పుకార్లను రజినీ నవ్వుతూ కొట్టిపారేశారు.

"నేను అసలు రాజకీయాల్లోనే లేను, అలాంటప్పుడు విజయ్‌ను చూసి నాకెందుకు అసూయ? ఒకవేళ నా సమకాలీనుడైన కమల్ హాసన్ సీఎం అయి ఉంటే ఏమో కానీ, విజయ్ పై నాకు అలాంటి భావన లేదు. మా ఇద్దరి మధ్య జనరేషన్ గ్యాప్ ఉంది, మా మధ్య పోటీ సరికాదు" అంటూ తనదైన శైలిలో పంచ్ ఇచ్చారు. గతంలో రజినీకాంత్ సైతం రాజకీయాల్లోకి వస్తారని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

కానీ కొన్ని ఆరోగ్య కారణాల వల్ల ఆయన ఆ నిర్ణయాన్ని విరమించుకుని కేవలం సినిమాలకే పరిమితమయ్యారు. మరోవైపు విజయ్ మాత్రం తన సినీ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే పార్టీ పెట్టి, మొదటి ప్రయత్నంలోనే అధికారంలోకి రావడం కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సూపర్ స్టార్ పెద్ద మనసుతో విజయ్‌ను అభినందించడంపై అటు దళపతి ఫ్యాన్స్, ఇటు రజినీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

భవిష్యత్తులో విజయ్ ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించాలని కోరుకుంటున్నట్లు రజినీకాంత్ ఆకాంక్షించారు. ప్రస్తుతం విజయ్ ముఖ్యమంత్రిగా సరికొత్త బాధ్యతల్లో బిజీగా మారగా.. రజినీకాంత్ తన తదుపరి భారీ చిత్రాల షూటింగ్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. పాలిటిక్స్ పక్కన పెడితే, వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే చూడాలని కోలీవుడ్ వర్గాలు ఇప్పటికీ ఆశగా ఎదురుచూస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One