Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విమర్శలు కాదు...దేశ భద్రత కోసం ప్రధాని విదేశీ పర్యటన

విమర్శలు కాదు...దేశ భద్రత కోసం ప్రధాని విదేశీ పర్యటన

అందరినీ పెట్రోల్‌ను పొదుపుగా వాడమని సూచించిన ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకు వెళ్లారంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ చమురు సరఫరాపై పడే ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీ UAE పర్యటన చేపట్టారు.

ఈ పర్యటనలో భారతదేశ ఇంధన భద్రతకు కీలకమైన అనేక ఒప్పందాలు కుదిరాయి. భారత్‌లో ప్రస్తుతం వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాలు (Strategic Petroleum Reserves) విశాఖపట్నం, మంగళూరు, పదూర్ ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిలో లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు నిల్వ సామర్థ్యం ఉంది. తాజా ఒప్పందం ప్రకారం UAEకి చెందిన జాతీయ చమురు సంస్థ ADNOC భారత్‌లోని ఈ నిల్వ కేంద్రాల్లో భాగస్వామ్యం అవుతోంది.

ఈ భాగస్వామ్యంతో చమురు నిల్వలను 30 మిలియన్ బారెళ్ల వరకు విస్తరించేందుకు అంగీకారం కుదిరింది. ఈ ఒప్పందం ప్రత్యేకత ఏమిటంటే — నిల్వ కేంద్రాలు భారతదేశానివే, కానీ అందులో నిల్వ అయ్యే చమురు UAEది. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఆ చమురును ఉపయోగించుకునే మొదటి హక్కు భారత్‌కే ఉంటుంది. అలాగే ఒడిశాలోని చండీఖోల్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వద్ద చేపట్టబోయే రెండో దశ SPR ప్రాజెక్టులకు కూడా UAE భారీగా పెట్టుబడులు పెట్టనుంది.

ఈ ఒప్పందంతో భారత్‌కు కలిగే లాభాలు: • వేల కోట్ల రూపాయల విలువైన ముడి చమురును కొనుగోలు చేసి నిల్వ చేసే భారం తగ్గుతుంది. • భారత భూభాగాన్ని వినియోగిస్తున్నందుకు UAE లీజు చెల్లిస్తుంది. • కొంత చమురును భారత్ ఉచితంగా వినియోగించే అవకాశం ఉంటుంది. • అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో ముందుగా నిర్ణయించిన ధరలకు చమురు వినియోగించే హక్కు భారత్‌కు ఉంటుంది.

• అత్యవసర సమయంలో సముద్ర మార్గాలపై ఆధారపడకుండా, దేశీయ రిఫైనరీలకు పైప్‌లైన్ల ద్వారా తక్షణ సరఫరా సాధ్యమవుతుంది. UAEకి కలిగే ప్రయోజనాలు: • ప్రపంచంలోనే అతిపెద్ద చమురు మార్కెట్లలో ఒకటైన భారత్‌లో తన స్థానం మరింత బలపడుతుంది. • భారత్‌ను కేంద్రంగా చేసుకుని దక్షిణాసియా దేశాలకు చమురు వ్యాపారం విస్తరించవచ్చు. • భారత ప్రభుత్వం కొన్ని పన్ను రాయితీలు కూడా కల్పించింది.

ఈ ఒప్పందంలో మరో కీలక అంశం ఫుజైరా పోర్ట్ నిల్వలు. హార్ముజ్ జలసంధి ప్రాంతంలో భవిష్యత్తులో యుద్ధ పరిస్థితులు తలెత్తినా, ఫుజైరా పోర్ట్ ద్వారా భారత్‌కు సురక్షితంగా చమురు సరఫరా కొనసాగించే అవకాశం ఉంటుంది. ఇది దేశానికి అదనపు ఇంధన భద్రతను కల్పిస్తుంది. అంతేకాకుండా IOCL మరియు ADNOC మధ్య దీర్ఘకాలిక LPG సరఫరా ఒప్పందం కూడా కుదిరింది.

దీని వల్ల దేశంలో వంటగ్యాస్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని 'Strategic Gas Reserves' అభివృద్ధి చేసేందుకు కూడా భారత్-UAE కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. కాబట్టి, విమర్శకులు చెబుతున్నట్లుగా ఇది విహార యాత్ర కాదు. దేశ ప్రజలకు భవిష్యత్తులో ఇంధన కొరత రాకుండా, దీర్ఘకాలిక ఇంధన భద్రత కోసం తీసుకున్న వ్యూహాత్మక చర్యలలో ఇది ఒక ముఖ్యమైన అడుగు. విమర్శలకంటే వాస్తవాలను తెలుసుకుని స్పందించడం మంచిది. సంకలన : చాడా శాస్త్రి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One