Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విష్ణు ప్రియకు ఫారెన్ సంబంధాలు!

విష్ణు ప్రియకు ఫారెన్ సంబంధాలు!

జీ తెలుగులో ప్రసారమవుతున్న ఫామిలీ అసెంబ్లీ షోలో విష్ణుప్రియ - రోజా కంబినేషన్ ఆడియన్స్ బాగా ఎంటర్టైన్ అవుతున్నారు. ఇక ఈ వారం ఎపిసోడ్ లో విష్ణు ప్రియా నాకు పెళ్లి కావాలి అంటూ రోజాని తెగ సతాయించింది."మీకు నా ప్రాబ్లమ్ చెప్పుకుందామని వస్తే" అంటూ విష్ణుప్రియ తెగ నాంచింది.

దాంతో రోజా ఏంటా ప్రాబ్లమ్ చెప్పు అన్నారు. "నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను" అంది విష్ణుప్రియ. "ఇలా ఒంటెలా ఉంటే అలా ఒంటరిగానే మిగిలిపోతారు. ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావ్ " అన్నారు రోజా.

"నాకు మాత్రం సెక్యూరిటీ కావాలి కదా మేడం. ఇంట్లో దొంగలు పడ్డారు మేడం " అంది విష్ణుప్రియ. "సెక్యూరిటీ ఎందుకు. కుక్కల్ని పెంచుకోవచ్చుగా " అన్నారు.

"కుక్క ఉంది జాగ్రత్త అని బోర్డు కూడా పెట్టాను " అంది. "ఐతే వెంటనే ఆ బోర్డు మార్చి కుక్కలున్నాయి జాగ్రత్త " అని పెట్టు అన్నారు. "నాకు ఉంది ఒక కుక్కే మేడం కుక్కలున్నాయి అని ఎందుకు" అంటూ అడిగింది. "ఉన్నాయ్ నీకు తెలీదు.

నువ్వు అరిస్తే వెళ్లిపోతాయి" అంటూ రోజా కామెడీ చేసారు. "మేడం అసలు నా ఫాలోయింగ్ మీకు అర్ధం కావట్లేదు. ఫారెన్ నుంచి సంబంధాలు వస్తున్నాయి. ఒకతను ఐతే నిన్నే పెళ్లిచేసుకుంటా అని నాకు మెయిల్ చేస్తున్నాడు " అంది.

"నువ్వు మేల్ అని తెలీక నీకు మెయిల్ చేసి ఉంటాడు" అంది. అంతే విష్ణుప్రియ షాకైపోయింది. "నాకు మాత్రం నా చేయి ఇలా పట్టుకుని అక్కడ చుక్క చూపిస్తాడని ఆశ ఉండదా మేడం " అంది. "నీకు ఒక చుక్క చూపిస్తే నువ్వు 100 చుక్కలు చూపిస్తావని వాడికి భయం " అన్నారు. "నాకు మాత్రం ఏడడుగులు వేయాలని ఆశ ఉండదా మేడం " అంది. "నీతో ఏడడుగులు వేస్తె నువ్వు 70 అడుగుల లోతుకు తొక్కేస్తావని వాడికి తెలీదా" అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One