Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వివేకా హత్యపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

వివేకా హత్యపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

గొడ్డలి పార్టీ అని ప్రజల్లోకి వెళ్లే కొద్ది సైకోలో ఫ్రస్ట్రేషన్‌ పెరుగుతోంది... వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

తన తండ్రిని ఎవరు చంపారో తెలుసుకునే హక్కు వివేకా కుమార్తె సునీతకు ఉందన్నారు. ఆమె పోరాటం కారణంగానే ఇప్పటికీ వివేకా హత్య కేసు సజీవంగా ఉందన్నారు. సునీత పోరాటంలో న్యాయం, ధర్మం ఉన్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మీడియాతో చిట్‌చాట్ నిర్వహించి పలు కీలక అంశాలను సీఎం చంద్రబాబు వెల్లడించారు.

జగన్ కుటుంబ చరిత్ర, హత్యా రాజకీయాల గురించి ప్రస్తుత తరానికి తెలుస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. వైఎస్ కుటుంబం అరాచకాల గురించి తనకు కూడా కొన్ని విషయాలు తెలియవని.. ఇప్పుడు అవన్నీ బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు. 30 ఏళ్ల క్రితం వచ్చిన 'కడప జిల్లాలో పాలెగాళ్ల రాజ్యం' పుస్తకాన్ని ఇప్పుడు అందరూ చదువుతున్నారని తెలిపారు.

సైకో కంటే 'గొడ్డలి పార్టీ' అనే పేరును ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా గుర్తించారని అన్నారు. గొడ్డలి పార్టీ అనే ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లే కొద్దీ జగన్‌లో అసహనం పెరుగుతోందని ఎద్దేవా చేశారు. హత్యా రాజకీయాలు చేసిన వారు రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు కానీ, బాధితులు మాత్రం జిల్లా రాజకీయాలు చేయకూడదా? అంటూ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.

నక్సలైట్లు తుపాకులతో రాజ్యాధికారాన్ని సాధించలేకపోయారని.. అలాగే గొడ్డలి పార్టీతో వీళ్లు రాజకీయాలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. అసలు ప్రజాస్వామ్యానికి వీళ్లు ఎలా సరిపోతారంటూ వైసీపీ, జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై చంద్రబాబు మాట్లాడారు.

మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ని టీడీపీ ప్రకటించడం దేశ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందన్నారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ని టీడీపీ ప్రకటించడం దేశ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందన్నారు. మహిళా రిజర్వేషన్లను అన్ని పార్టీలు స్వాగతించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆయన పేర్కొన్నారు.

మొదటి నుంచీ మహిళలకు టీడీపీ అండగా ఉందని సీఎం చెప్పుకొచ్చారు. డీలిమిటేషన్ విషయంలో 2011 జనాభా లెక్కలైనా, తాజా లెక్కలైనా మనకు నష్టం కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అందుకే ఉన్న స్థానాలను 50 శాతం పెంచితే అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. పెంచిన స్థానాలను మహిళలకు కేటాయించవచ్చని అభిప్రాయపడ్డారు.

దీంతో గతంలో ఈ బిల్లును వ్యతిరేకించిన వారి ఆలోచన కూడా మారవచ్చని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లుల విషయంలో కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉందన్నారు. రెండు బిల్లులను తీసుకురావడానికి కేంద్రం సిద్ధమవుతోందని, ఆ రెండింటినీ విడదీసి చూడాల్సిన అవసరం ఏముందని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. రెండు బిల్లులు కలిపి వస్తేనే మహిళలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్, పునర్విభజన బిల్లులు తప్పనిసరిగా తీసుకురావాలని, ఇవి దేశ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొస్తాయని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One