Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ye Devi Varamo Neevu అంజలిని బుట్టలో వేయాలని రాకీ కొత్త ప్లాన్ గీతాంజలి ఎంట్రీతో షాక్‌లో మనీష్

Ye Devi Varamo Neevu అంజలిని బుట్టలో వేయాలని రాకీ కొత్త ప్లాన్ గీతాంజలి ఎంట్రీతో షాక్‌లో మనీష్

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'(Ye Devi Varamo Neevu).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -22 లో.....అంజలిని రాకీ డబ్బుతో పడెయ్యాలనుకుంటాడు కానీ అంజలి డబ్బుతో పడే అమ్మాయి కాదని రాకీకి అర్థమవుతుంది.

తనని పడేయ్యడానికి ఒక ప్లాన్ వెయ్యలనుకుంటాడు రాకీ. ఆ తర్వాత అంజలి ఇంట్లో అన్ని పనులు చేసి భోజనం ఏర్పాట్లు చేస్తుంది. అందరికి వడ్డిస్తుంది.. ఇంతక ముందు పనమ్మాయి కేవలం వంట చేసేది వెళ్ళేది కానీ అంజలి మాత్రం అన్ని పనులు చేస్తుందని రత్నం అంటుంది.

పనిమనిషి అన్ని పనులు చేస్తుందని రత్నం మనవరాలు అంటుంది. తను పనిమనిషి కాదు మన మనిషి అనుకోబట్టే అన్ని చేస్తుందని రాజారావు అంటాడు. నువ్వు కూడా కూర్చొని భోజనం చెయ్ అమ్మా అని రత్నం అనగానే ఏంటి తను మనతో కూర్చొని కలిసి భోజనం చేస్తుందా అని రత్నం మనవరాలు అంటుంది. అలా తినమని గొప్ప మనసుతో వాళ్ళు చెప్పినా తినే సంస్కారం నాకు లేదని అంజలి కింద కూర్చొని భోజనం చేస్తుంది.

అబ్బా సాంబార్ బాగుంది అంజలి అన్ని రుచులు చూపిస్తుందని రాకీ అంటాడు. అన్నయ్య నువ్వు సాంబార్ టేస్ట్ చెయ్ అని రాకీ అనగానే మనీష్ సాంబార్ వేసుకొని చాలా బాగుంది సేమ్ అత్తయ్య చేసినట్లు ఉందని మనీష్ అంటాడు. అంటే వంట విషయంలో తన తల్లిది వచ్చిందన్నమాట అని రాజారావు అనుకుంటాడు. ఆ తర్వాత అత్తయ్య ఇచ్చిన గడువు ఇంకా మూడు రోజులు ఉంది.

ఈ మూడు రోజులు అత్తయ్యకి అంజలి కన్పించకూడదని మనీష్ అనుకుంటాడు. అప్పుడే గీతాంజలి కుటుంబంతో సహా వస్తుంది. తనని చూసి మనీష్ షాక్ అవుతాడు. రాజారావుకి వెళ్లి చెప్తాడు.

నేను అంజలి రాకుండా చూస్తాను. నువ్వు వాళ్ళు లోపలికి రాకుండా చూడమని రాజారావు అంటాడు. ఆ తర్వాత గీతాంజలి వాళ్ళు రాకుండా మనీష్ ఏదో ఒకటి టాపిక్ డైవర్ట్ చేస్తాడు. ఎంట్రా నీకు ఏమైంది అంటూ గీతాంజలి లోపలికి వస్తుంది.

ఆ తర్వాత రాజారావు మనీష్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ అందరిని కన్ఫూజన్ చేస్తారు. తరువాయి భాగంలో అంజలి కాఫీ తీసుకొని వస్తుంటే మనీష్ ఆపి తను తీసుకొని వస్తాడు. కాఫీ చాలా బాగుంది ఒకసారి కాఫీ చేసిన అమ్మాయిని పిలవమని గీతాంజలి అనగానే మనీష్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One