Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ye Devi Varamo Neevu  గీతాంజలితో అంజలి వార్ విదేశాల నుంచి రానున్న శివశంకర్

Ye Devi Varamo Neevu గీతాంజలితో అంజలి వార్ విదేశాల నుంచి రానున్న శివశంకర్

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'(Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -24 లో......గీతాంజలి ఇంటికి వచ్చి వెళ్లిన విషయం అంజలి గుర్తుచేసుకొని కోపంగా ఉంటుంది.

అప్పుడే మనీష్ వచ్చి నీపై మా అత్తయ్య చాలా కోపంగా ఉంది. నువ్వు అందరి ముందు తనకి సారీ చెప్పమని మనీష్ అనగానే నేనేం తప్పు చెయ్యలేదు.. ఏం తప్పు చెయ్యని నేను తప్పు చేసిన మనిషికి సారీ ఎందుకు చెప్పాలి.. అసలు చెప్పనని అంజలి అనగానే నీ వల్ల తనకి నష్టం జరిగిందని మనీష్ అంటాడు.

ఆవిడ వల్ల మాకు చాలా నష్టం జరిగింది జానకమ్మని పోగొట్టుకున్నామని అంజలి అంటుంది. అంజలి మాటలు విని మనీష్ షాక్ అవుతాడు. ఇద్దరు మొండిగా ఉంటారు. ఇప్పుడు ఏం చెయ్యాలని మనీష్ టెన్షన్ పడుతాడు.ఆ తర్వాత రాజారావు దగ్గరికి అంజలి వచ్చి ప్రొద్దున మీ అమ్మాయి వచ్చినప్పుడు ఎందుకు నన్ను బయటకు రావద్దని అన్నారు.

ఎందుకు మీరు ఇబ్బందిపడ్డారు గొడవ అవుతుందని బయపడ్డారా.. నేను ఇక్కడ ఉంటే మీరు ఇలా ఇబ్బంది పడుతారు.. నేను వెళ్ళిపోతానని అంజలి అనగానే ఎక్కడకి వద్దని రాజారావు చెప్తాడు. మరొకవైపు ఫారెన్ నుంచి శివశంకర్, కమలకి గీతాంజలి వీడియో కాల్ చేస్తుంది.

మీరు మా మ్యారేజ్ డేకి మీరు వస్తున్నారు కదా అన్నయ్య అని అడుగుతుంది. నా చెల్లి పెళ్లి రోజుకి నేను రానా కచ్చితంగా వస్తానని శివశంకర్ అంటాడు. మరొకవైపు పెళ్లిరోజుకి ఏర్పాట్లు ఎలా చెయ్యాలో ఏంటోనని రత్నం, రాజారావు డిస్కషన్ చేసుకుంటుంటే అంజలి వచ్చి నేను అన్ని చూసుకుంటానని చెప్తుంది. తరువాయి భాగంలో అంజలిని తీసుకొని రాజారావు షాపింగ్ కి వెళ్తాడు. ఎక్కడ గీతాంజలి చూస్తుందోనని మనీష్ టెన్షన్ పడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One