Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ye Devi Varamo Neevu ప్రీతిని కాపాడిన అంజలి గీతాంజలికి ఎదురుపడిన అంజలి మనీష్

Ye Devi Varamo Neevu ప్రీతిని కాపాడిన అంజలి గీతాంజలికి ఎదురుపడిన అంజలి మనీష్

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'(Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -27 లో.....శంకర్ దగ్గరికి రాజారావు వచ్చి నీ చెల్లి పెళ్లి ముందు రోజు ఘటన గుర్తు ఉందా అని అడుగుతాడు.

ఇప్పుడు ఆ విషయం ఎందుకు గుర్తువచ్చిందని శంకర్ కోప్పడుతాడు. నువ్వు ఆ రోజు చేసింది తప్పు అని రాజారావు అనగానే నేను ఆ రోజు చేసింది తప్పు కాదు తప్పుని సరిదిద్దాను. ఇందులో తప్పు ఎవరిది లేదు ఆ బిడ్డ జాతకమే అంతా.. అది మారదని శంకర్ అంటాడు.

నేను మారుస్తానని రాజారావు అనుకుంటాడు. మరొకవైపు ప్రీతీ ఇంకా ఇంటికి రాలేదని రత్నం టెన్షన్ పడుతుంది. ఒరేయ్ మనీష్.. మీ చెల్లి ఇంకా ఇంటికి రాలేదు.

ఒకసారి వెళ్ళు అని రత్నం అంటుంది. నాకు పని ఉంది అయిన ఆడపిల్లకి స్వేచ్ఛ ఇవ్వాలి.. అప్పుడే ధైర్యంగా ఉంటారని చెప్తాడు. అమ్మమ్మ నేను వెళ్లి చూసి వస్తానని అంజలి వెళ్తుంది.

ప్రీతీ తన ఫ్రెండ్ తో నడుచుకుంటూ వస్తుంది. అంజలి తన దగ్గరికి వెళ్లి ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడుతున్నారని చెప్తుంది. నేను వస్తాలే గానీ వెళ్ళమని ప్రీతి కోప్పడుతుంది. ఎవరు ఆవిడ అని తన ఫ్రెండ్ అడుగుతుంది.

పనిమనిషి ఇంప్రెషన్ కొట్టేయలని చూస్తుందని ప్రీతి చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళు నడుచుకుంటూ వస్తుంటే కొంతమంది అబ్బాయిలు ప్రీతీని ఏడిపిస్తారు. అప్పుడే అంజలి వచ్చి తన చాకచక్యంతో వాళ్ళు పారిపోయేలా చేస్తుంది. దాంతో ప్రీతి ఇంటికి వెళ్లి జరిగింది చెప్తుంది.

చాలా థాంక్స్ అమ్మ అని రత్నం చెప్తుంది. నువ్వు అంజలిని చూసి నేర్చుకో.. భయపడడం కాదని రత్నం అనగానే కమల కోపంగా చూస్తుంది. పనిమనుషులకి ఆ మాత్రం విశ్వాసం ఉండాలని అంటుంది.

అంజలి బాధగా లోపలికి వెళ్తుంది. సారీ అంజలి మీరు వెళ్ళమన్నప్పుడు నేను వెళ్ళలేదని అంటాడు. ఆ తర్వాత కమల వచ్చి నీ దగ్గర నా కూతురు ఏం నేర్చుకోవాలి.. నీ స్థాయి ఏంటి..

నా కుతురు స్థాయి ఏంటని కమల అంటుంది. తరువాయి భాగంలో కూరగాయలకి మనీష్, అంజలి వెళ్తారు. అక్కడ ఒకతను వాళ్ళని చూసి గీతాంజలికి అంజలి కన్పించింది. పక్కనే మనీష్ సర్ ఉన్నాడని చెప్పగానే గీతాంజలి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One