Saturday, 23 Jan, 12.20 pm Telugu Panchangam

Posts
రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో భారీ బందోబస్తు

రిపబ్లిక్ దినోత్సవానికి ముందు దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను ముమ్మరం చేశారు. దేశ రాజధాని అంతటా పెట్రోలింగ్ ముమ్మరం చేశారు.జనవరి 26 న కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించనున్న దృష్ట్యా ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లు కఠినతరం చేసినట్లు పోలీసులు తెలిపారు.బిజీగా ఉన్న మార్కెట్ ప్రాంతాల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. గ్రూప్ పెట్రోలింగ్, వాహనాల తనిఖీలు కూడా చేస్తున్నారు.కిరాయిదారులు, సేవకుల ధృవీకరణ, సరిహద్దుల్లో తనిఖీ, సెకండ్ హ్యాండ్ కార్ల డీలర్లు, సిమ్ కార్డ్ డీలర్ల వద్ద పోలీసులు నిఘా పెట్టారు.

మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయం, బస్ టెర్మినల్స్ వద్ద బలగాలను మోహరించారు.వివిధ హోటళ్ళు, గెస్ట్‌హౌస్‌ల వద్ద సెక్యూరిటీ గార్డులను నియమించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కుంబింగ్ డ్రైవ్‌లు, డోర్-టు-డోర్ సర్వేలు చేపట్టారు. ఏదైనా గుర్తు తెలియని వస్తువు లేదా ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతుంటే సమీప పోలీసు స్టేషన్‌లో నివేదించాలని పోలీసులు ప్రజలను కోరారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Panchangam
Top