మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ, హౌసింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి పొంగులేటి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్, ఆర్డీవో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ప్రజలకు గౌరవప్రదమైన సేవలే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేయాలని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
రెవెన్యూ శాఖకు...
తొలి దశలో 125 తహసీల్దార్, 11 ఆర్డీవో కార్యాలయాలకు కొత్త భవనాల నిర్మాణం చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారరు. ఆధునిక సౌకర్యాలతో ఒకే నమూనాలో కార్యాలయాల నిర్మాణం ఉండేలా చూసుకోవాలని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. అద్దె, శిథిలావస్థలో ఉన్న కార్యాలయాలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న మంత్రి పొంగులేటి నిర్మాణాల కోసం స్థలాల గుర్తింపు, పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

