Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐపీఎల్ టిక్కెట్ బ్లాక్ లో.. పది మందిపై కేసులు

ఐపీఎల్ టిక్కెట్ బ్లాక్ లో.. పది మందిపై కేసులు

TeluguPost.com 3 days ago

రేపు హైదరాబాద్ లో బెంగళూరు తో సన్ రైజర్స్ హైదారాబాద్ మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కు ముందుగానే టిక్కెట్లను కొనుగోలు చేసి కొందరు బ్లాక్ లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ ముఠాను పోలీసులు కనుగొని వారిని కఠినంగా శిక్షించాలని క్రికెట్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. నిమిషాల్లోనే ముప్ఫయి తొమ్మిది వేల టిక్కెట్లు మాయమయ్యాయి.

ముఠాను కట్టడి చేయాలని...

ఉప్పల్‌లో రేపు బెంగళూరు, హైదరాబాద్‌ మ్యాచ్‌ చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వస్తారని భావించి ముందుగానే టికెట్లు కొని బ్లాక్‌లో ముఠా అమ్ముతున్నట్లు పోలీసులు కూడా గుర్తించారు. బ్లాక్‌ మార్కెట్‌కు టికెట్లు తరలించారని అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్‌ టికెట్ల దందాపై పోలీసులు స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. బ్లాక్ టికెట్లు విక్రయిస్తున్న వారిపై 10 కేసులు నమోదు చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu