America : అమెరికాలోని సియాటిల్ ఫుడ్ ఫెస్టివల్‌లో కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. ఈ కాల్పల్లో ఐదుగురికి గాయాలు అయనట్లు అధికారులు తెలిపారు.
స్పేస్ నీడిల్ సమీపంలో ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.
నిందితుడి కోసం...
బైట్ ఆఫ్ సియాటిల్ ఫెస్టివల్‌లో కాల్పులకు కారణం పై పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడు ఎవరన్నది తెలిసిన తర్వాత కాల్పుల కు కారణం తెలుస్తుందని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని పోలీసులు చెప్పారు.

