అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమెరికాలోని వర్జీనియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. స్టాపోర్ట్ కౌంటీ వద్ద రహదారిపై నియంత్రణ కోల్పోయిన బస్సు వాహనాలపైకి దూసుకెళ్లింది.
ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు.
34 మందికి గాయాలు...మరో ముప్ఫయి నాలుగు మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలయిన వారిని ఆసుపత్రికి తరలించారు. అతివేగంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

