Mumbai : బాలీవుడ్ యాక్టర్ అమితాబ్ బచ్చన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. అమితాబ్, అభిషేక్ బచ్చన్‌ను చంపేస్తామంటూ వార్నింగ్ లు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
గ్యాంగ్‌స్టర్ గోల్డీ ధిల్లాన్ నుంచి బెదిరింపులు వచ్చినట్లు తెలిసింది. ఢిల్లీ పోలీసులు తమ అనుచరులు ఇద్దరిని అరెస్టు చేశారని ధిల్లాన్ తెలిపారు.
ప్లాన్ లోమార్పులు లేవంటూ...అయినప్పటికీ మా ప్లాన్‌లో ఎలాంటి మార్పు ఉండదని ధిల్లాన్ మరోసారి ప్రకటించడం చర్చనీయాంశమైంది. ముంబైలో తన అనుచురులు 200 మంది రెడీగా ఉన్నారంటూ ధిల్లాన్ పోలీసులకు సవాల్ విసిరారు. అమితాబ్, అభిషేక్‌లను బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ కూడా కాపాడలేదని అన్న ధిల్లాన్ 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లను ప్రస్తావించారు. ఆ హింసకు బాధ్యులైన వారిని ఎప్పటికీ క్షమించబోమని ధిల్లాన్ తెలిపారు.

